శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-08-2023 మంగళవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించిన శుభం...

Leo
మేషం :- బంధు మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ప్రతి విషయం మీ జీవిత భాగస్వామికి తెలియజేయటం మంచిది. నూతన పెట్టుబడుల వ్యవహారంలో ఒక నిర్ణయానికి వస్తారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. ఆత్మీయులకిచ్చిన మాట నిలబెట్టుకుంటారు. 
 
వృషభం :- ఆస్తి పంపకాల విషయమై పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. రేషన్ డీలర్లు, నిత్యావసరవస్తు స్టాకిస్టులకు అధికారుల తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. రిప్రజెంటేటివ్‌లు, పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లు టార్గెట్లను అధికమిస్తారు. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
మిథునం :- ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. స్వయంకృషితో అనుకున్నది సాధిస్తారు. భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. మాటలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. 
 
కర్కాటకం :- చేపట్టిన ప్రాజెక్టులలో జాప్యం ఎదురు కావొచ్చు. ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు. గతంలో జరిగిన తప్పుల నుంచి మంచిని నేర్చుకోండి. కుటుంబీకుల ప్రేమకు మరింత దగ్గరవుతారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం. సినిమా, విద్యా కార్యక్రమాలలో పాల్గొంటారు. వర్తమానంపై మరింత దృష్టిపెట్టండి.
 
సింహం :- ఆర్థిక ఇబ్బందులు లేకపోయినా వెలితిగా ఉంటుంది. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ, మందులు, రసాయ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది.
 
కన్య :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అసవరం. కొంతమంది మిమ్ములను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
 
తుల :- స్థిరాస్తి, క్రయ విక్రయం విషయంలో మంచి లాభం ఉంటుంది. వాహనం ఇతరులకు ఇచ్చి సమస్యలను ఎదుర్కుంటారు. పాత ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆఫీసులో తొందరపాటు నిర్ణయాలతో కాక, మీ సీనియర్ల సలహాలను తీసుకొని ముందుకు సాగండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు మిశ్రమ ఫలితం. రవాణా రంగాలలో వారికి మిశ్రమ ఫలితం కానవస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆకస్మికంగా సన్నిహితులతో మార్పులు కానవస్తాయి. స్త్రీలకు శ్రమ, బంధువుల మధ్య ఏర్పడిన సందిగ్ధ పరిస్థితులు తీరిపోతాయి. ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.
 
ధనస్సు :- వృత్తి వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి. ఫైనాన్సు, చిట్ ఫండ్ రంగాలలో వారికి చికాకులు తప్పవు. రుణం ఏ కొంతైనా తీర్చాలనే మీ లక్ష్యం నెరవేరుతుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి.
 
మకరం :- నిరుద్యోగులకు సదవకాశాలు లభించినప్పటికినీ వాటిని సద్వినియోగం చేసుకొలేకపోతారు. ఇంజనీరింగ్, మెడికల్, కంప్యూటర్, శాస్త్ర సాంకేతిక రంగాల వారికి పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో కొంత మేరకు పురోగతి సాధిస్తారు. బంధువులతో చిన్న చిన్న కలహాలు జరిగే ఆస్కారం ఉంది. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారంతప్పవు.
 
మీనం :- మీ నైపుణ్యతకు, సామర్ధ్యమునకు తగినటు వంటి గుర్తింపు లభిస్తుంది. పాత రుణాలు తీర్చడంతో పాటు విలువైన పరికరాలు అమర్చుకుంటారు. కుటుంబీకులతో స్వల్ప విభేదాలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి. దంపతుల మధ్య అవగాహనా లోపం. సంఘంలో మీ మాటకు, గౌరవ మర్యాదలు లభిస్తాయి.