శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-08-2023 బుధవారం రాశిఫలాలు - సదాశివుని ఆరాధించిన శుభం...

astrolgy
మేషం :- ద్విచక్రవాహనంపై దూరప్రయాణాలు మంచిదికాదు అని గమనించండి. రాజకీయాలలోనివారికి పార్టీ పరంగాను, అన్ని విధాలా కలసివస్తుంది. వ్యవసాయ రంగాలలోనివారికి మెళుకువ అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఉపాధ్యాయుల తొందరపాటు తనం వల్ల సమస్యలు తలెత్తుతాయి.
 
వృషభం :- వస్త్ర, ఫోము, లెదర్, పీచు వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందిని కలిగిస్తాయి. స్నేహ సంబంధ బాంధవ్యాలు విస్తరిస్తాయి. రచయితలకు గుర్తింపు రాణింపు లభిస్తుంది. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
మిథునం :- స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన మంచిది. సమయాన్ని వృధా చేసే కొలది నష్టాలను ఎదుర్కుంటారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. నూనె, ఎండుమిర్చి, పసుపు, ధనియాలు, బెల్లం, శెనగలు వ్యాపారస్తులకు స్టాకిస్టులకు అనుకూలమైన కాలం. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
కర్కాటకం :- మీ సంతానం కోసం ధనం బాగా ఖర్చుచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళుకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలోని వారికి పనిలో ఒత్తిడి అధికమవుతుంది. మిమ్మల్ని హేళన చేసే వారు మీ సహాయాన్ని అర్థిస్తారు. స్త్రీలకు ఉదరం, మెకాళ్ళు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
సింహం :- వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. క్లిష్టతరమైన పనుల్ని ఎలా అధిగమించాలో తెలియనప్పుడు తగిన సూచనలు పాటించండి. ఐరన్, సిమెంట్, కలప రంగాలలోని వారికి చికాకులు తలెత్తుతాయి. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. మీ ప్రగతికి కుటుంబ సభ్యులు సహకరిస్తారు.
 
కన్య :- దైవదర్శనాల్లో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. గృహోపకరణాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ యత్నాలకు ప్రముఖుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. బ్యాంకు డిపాజిట్లు దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. 
 
తుల :- వస్త్ర, బంగారు విలువైన వస్తువులను అమర్చుకుంటారు. ఉద్యోగస్తులకు శ్రమకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆదాయం పెంచుకునేందుకు చేసేయత్నాల్లో సఫలీకృతులవుతాయి. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు.
 
వృశ్చికం :- స్థిరాస్తుల అమ్మకానికై చేయుయత్నాలు వాయిదా పడటం మంచిది. పాత మిత్రులకలయికతో కొత్త అనుభూతి పొందుతారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సత్కాలం. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. తలపెట్టిన పనిలో సంతృప్తి, జయం చేకూరగలదు. ఓర్పు, నేర్పులతో మీరు అనుకున్నది సాధిస్తారు.
 
ధనస్సు :- తలపెట్టిన పనులు అనుకూలిస్తాయి. స్త్రీలపై సన్నిహితులు, చుట్టుపక్కల వారి ప్రభావం అధికంగా ఉంటుంది. వాహనం నిదానంగా నడపటం క్షేమదాయకం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. కుటుంబీకుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ, పైఅధికారుల సహాయ సహకారాలు లభించగలవు.
 
మకరం :- క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. కోల్పోయిన వస్తువులు, పత్రాలు చేజిక్కించుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు.
 
కుంభం :- రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఒత్తిడి అధికం. మనోధైర్యంతో యత్నాలు సాగించాల్సి ఉంటుంది. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. ఇసుక, క్వారీ కాంట్రాక్టర్లకు ప్రభుత్వాధికారుల నుంచి వేధింపులు తప్పవు.
 
మీనం :- ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, శ్రమాధిక్యత మినహా ఫలితం ఏమాత్రం ఉండదు. వ్యాపారాల్లో నష్టాలు, ఆటంకాలు క్రమేణా అధికమిస్తారు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేస్తారు.