శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 1 సెప్టెంబరు 2023 (11:04 IST)

01-09-2023 శుక్రవారం రాశిఫలాలు - కార్తీకేయుడిని పూజించినా మీ మనోవాంఛలు...

Mesha Raashi
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ ఐ|| విదియ తె.3.21 పూర్వాభాద్ర సా.6.48 తె.వ. 3.49 ల 5.20. ఉ.దు. 8.17 ల 9.07 ప. దు. 12.25ల 1.15.
 
మేషం :- పొదుపు విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు అధికమైనా సకాలంలో పూర్తిచేస్తారు. సిమెంటు, ఐరన్, కలప, ఇటుక వ్యాపారస్తులకు కలిసిరాగలదు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభాకాంక్షలు అందుకుంటారు.
 
వృషభం :- గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు ప్రతి విషయంలోను ఓర్పు, లౌక్యం అవసరం. వృధా ఖర్చులు, అనుకోని చెల్లింపుల వల్ల ఒకింత ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగ, ఉన్నత విద్యాయత్నాల్లో పురోగతి కనిపిస్తుంది. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది.
 
మిథునం :- వృత్తి వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి. స్థిరచరాస్తుల క్రయవిక్రయాల్లో పునరాలోచన మంచిది. కుటుంబీకుల నుండి, మిత్రుల నుండి ఒత్తిడి ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఆశాజనకం. వ్యాపారాల విస్తరణకు కొంత జాప్యం తప్పదు. అతిగా సంభాషించడం వల్ల ఏర్పడే అనర్థాన్ని ఈ మాసం మీరు గుర్తిస్తారు. 
 
కర్కాటకం :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఆదాయాభివృద్ధి, మానసిక ప్రశాంతత, సంఘంలో గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. విదేశీయాన యత్నాలలో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఉద్యోగ, విద్య ప్రకటనల పట్ల అవగాహన అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతి లభించదు.
 
సింహం :- వృత్తి ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. మీ సమర్థతకు గుర్తింపు, అవకాశాలు కలిసివస్తాయి. రచయితలు, క్రీడ, కళాకారులకు ప్రోత్సాహకరం. మొహమాటాలకు దూరంగా ఉండాలి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు.
 
కన్య :- ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటుతాయి. వాహనం నడిపి ఇబ్బందులకు గురికాకండి. అపరిచితులతో మితంగా సంభాషించటం క్షేమదాయకం. ప్రస్తుత వ్యాపారాలపైనే దృష్టి సారించండి. మీ సోదరుల మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి లేక శ్రీవారి వైఖరి మనస్థాపం కలిగిస్తుంది.
 
తుల :- స్త్రీల మాటకు కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. వృత్తి, వ్యాపారాలలో గణనీయమైన మార్పులు కానవస్తాయి. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. పాత మిత్రుల కలియికతో మానసికంగా కుదుటపడతారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
వృశ్చికం :- సంఘంలో మంచిపేరు, ఖ్యాతి గడిస్తారు. రోజులు భారంగా గడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సోదరీ, సోదరు మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. స్త్రీలు శారీరక మానసికవేదనకు గురవుతారు. కొనుగోలుదార్లు, సేల్స్ సిబ్బందితో సమస్యలు తలెత్తే సూచనలున్నాయి.
 
ధనస్సు :- ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు తల, కాళ్లు, నరాలు, ఎముకలకి సంబంధించిన చికాకులను ఎదుర్కొంటారు. విద్యార్థులు క్రీడా కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయ నాయకులు సభ, సమావేశాలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.
 
మకరం :- శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ముఖ్యులతో మాటపట్టింపు వచ్చే ఆస్కారం ఉంది. కిరణా, ఫ్యాన్సీ, పండ్ల, పూల, వ్యాపారులకు శుభదాయకం. మీ సంతానం మొండివైఖరిమీకెంతో చికాకు కలిగిస్తుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది.
 
కుంభం :- బంధువుల రాకతో గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పత్రికా, మీడియా రంగాలవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. ధనవ్యయం, విరాళాలిచ్చే విషయంలో మెలకువ వహించండి. స్త్రీలు నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
మీనం :- కుటుంబీకులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. పెద్దలు, మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. విద్యుత్, రవాణా రంగాలలోని వారికి చికాకులు అధికం. ఉద్యోగం మాని వ్యాపారాలు చేయడం మంది కాదని గమనించండి. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.