సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-09-2023 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని ఆరాధించిన మీ సంకల్పం...

Mithunam
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ ఐ|| పంచమి రా.9.54 అశ్వని ప.3.18 ఉ.వ.11.27 ల 12.59 రా.వ.12.42 ల 2.16, ప. దు. 12.24 ల 1.13 పు.దు. 2.52 ల 3.41. 
 
మేషం :- వృత్తి, వ్యాపార రంగాల్లో వారి అంచనాలు, ఊహలు తారుమారయ్యే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ధనం రాకడ, పోకడ సరిసమానంగా ఉంటాయి. దైవ దర్శనాలు చేస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. దూరప్రయాణాలు మీకు అనుకూలించగలవు. 
 
వృషభం :- సహోద్యోగుల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు. రాజకీయనాయకులకు ప్రయాణాలు అధికమవుతాయి. సాహస ప్రయత్నాలు విరమించండి. ప్రైవేటు సంస్థల్లో వారు మార్పులకై చేయుయత్నాల్లో సఫలీ కృతులౌతారు. ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవటం క్షేమదాయకం.
 
మిథునం :- సమయానికి చేతిలో ధనం లేక ఇబ్బందు లెదుర్కుంటారు. స్త్రీలకు ప్రకటనలు, అపరిచిత వ్యక్తు పట్ల ఏకాగ్రత అవసరం. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు పనివారలతో సఖ్యత లోపిస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి వల్ల ఇబ్బందులు తప్పవు. పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
కర్కాటకం :- ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. వృత్తుల్లో వారికి సమీప వ్యక్తుల సహకారం వల్ల అభివృద్ధి కానవస్తుంది. దంపతుల మధ్య కలహాలు, చికాకులు చోటుచేసుంటాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. బంధు మిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది.
 
సింహం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఒత్తిడి తప్పదు. వైద్యులు అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరుల సలహా విన్నప్పటికీ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. బంధువులకు ధన సహాయం చేసే విషయంలో పునరాలోచన అవసరం.
 
కన్య :- వైద్యులకు శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత బాగా అవసరం. రుణ ప్రయత్నం వాయిదాపడగలవు. స్త్రీలకు టీవీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. పెద్దల ఆరోగ్యంలో జాగ్రత్త అవసరం. పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. మీరు చేపట్టిన పనికి ఇతరులనుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు.
 
తుల :- మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. ప్రేమికుల మధ్య అవగాహన కుదరదు. ఒక స్థిరాస్తి అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. వాతావరణంలో మార్పు వల్ల పెద్దల ఆరోగ్యం మందగిస్తుంది. వస్త్ర, బంగారం, వెండి, లోహ వ్యాపారులకు పనివారలతో చికాకులు ఎదుర్కోవలసివస్తుంది.
 
వృశ్చికం :- బ్యాంకు పనులు పూర్తి చేస్తారు. స్త్రీలు కలుపుగోలుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. మంచి చేసినా విమర్శలు తప్పవు. కళాకారులకు గుర్తింపు, లభిస్తుంది. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ట్రాన్స్‌పోర్టు, ఆటోమోబైల్, మెకానికల్ రంగాల్లో వారికి ఒత్తిడి అధికమవుతుంది.
 
ధనస్సు :- ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు. స్థిరాస్తి లేదా వాహననాలు కొనుగోలు చేసే విషయంలో ఆచి తూచి వ్యవహరించండి. కోర్టు వ్యవహరాలు ఏమాత్రం ముందుకు సాగవు. స్త్రీలు కండరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు.
 
మకరం :- దైవ, పుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ధనం బాగా వ్యయం చేసి అనుకున్న పనులు పూర్తిచేస్తారు. చిన్నతరహా, చిరువ్యాపారులకు పురోభివృద్ధి. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. విదేశీయానం, రుణయత్నాలు అనుకూలిస్తాయి.
 
కుంభం :- వృత్తి వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆకస్మిక ధన లాభం,కార్యసిద్ధి. దైవ, సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు సాగుతారు. తొందరపడి చెల్లింపులు జరుపవద్దు. శతృవులపై విజయం సాధిస్తారు.
 
మీనం :- ఆర్థిక లావాదేవీలు, వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. రుణ వాయిదాలు, పన్నులు, ఫీజులు సకాలంలో చెల్లిస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రాపకం పొందుతారు. విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది.