గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

08-09-2023 శుక్రవారం రాశిఫలాలు - ఇష్టకామేశ్వరి దేవిని పూజించడంవల్ల సర్వదా శుభం...

tula rashi
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ ఐ|| నవమి రా.8.17 మృగశిర సా.4.03 రా.వ.12.56 ల 2.38. ఉ.దు.8.17 ల 9.07 ప. దు. 12. 25 ల 1.15.
 
మేషం :- ఉపాధ్యాయులకు విశ్రాంతి లభిస్తుంది. వ్యాపారస్తులకు, వృత్తుల వారికి ఆశించినంత పురోగతి ఉండదు. సాహస ప్రయత్నాలు విరమించండి. మీ ఉన్నతినిచూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి.
 
వృషభం :- అధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. పెద్దల ఆహార వ్యవహారాలో మెళకువ వహించండి. కుటుంబ అవసరాలు పెరగటంతో ఇబ్బందులను ఎదుర్కుంటారు.
 
మిథునం :- బంధువులను కలుసుకుంటారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. కుటుంబీకుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఆడంబరాలకు, విలాసాలకు ధనం విరివిగా వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలు ప్రగతి పథంలో సాగుతాయి. పెద్దల మాట పెడచెవిన పెట్టి ఇబ్బందులకు గురికాకండి.
 
కర్కాటకం :- ధనానికి ఇబ్బంది లేకున్నా ఆర్థిక సంతృప్తి అంతగా ఉండదు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత, ఓర్పు అవసరం. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవాలి. ఆకస్మికంగా ప్రయాణం తలపెడతారు.
 
సింహం :- మిత్రులకిచ్చిన మాట కోసం శ్రమ, ప్రయాసలు పడవలసి ఉంటుంది. హామీలు, అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. కీలమైన వ్యవహారాల్లో మెళకువ వహించండి. వైద్యులకు బాధ్యతల్లో అలక్ష్యం మంచిదికాదు.
 
కన్య :- ఇంటా, బయట గౌరవం లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. ముఖ్య విషయాల్లో ఆచి, తూచి వ్యవహరించండి. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించటం వల్ల అస్వస్థతకు లోనవుతారు. ఉద్యోగస్తుల కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. రాజకీయాల్లో వారికి పదవులు, సభ్యత్వాలకు మార్గం సుగమమవుతుంది.
 
తుల :- తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. సహచరుల సలహా వల్ల నిరుద్యోగులు సదావకాశాలు జారవిడుచుకుంటారు. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఖర్చులు పెరగటంతో అదనపు ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. బంధువుల రాకతో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది.
 
వృశ్చికం :- భార్య, భర్తల ఆలోచనలు, అభిప్రాయభేదాలు భిన్నంగా ఉంటాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉద్యోగస్తులు గుట్టుగా ప్రమోషన్ యత్నాలు సాగించాలి. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండటం మంచిది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక ఫలిస్తుంది.
 
ధనస్సు :- సోదరులతో ఏకీభవించలేకపోతారు. రవాణా రంగంలోని వారికి చికాకు తప్పదు. ఉద్యోగస్తుల సమర్థతను, అంకితభావాన్ని అధికారులు గుర్తిస్తారు. విద్యార్థులకు అత్యుత్సాహం కూడదు. రాజకీయ విషయాల పట్ల ఆసక్తి అధికమవుతుంది. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు.
 
మకరం :- చాకచక్యంగాపనులు చక్కబెట్టుకుంటారు. అనుక్షణం మీ సంతానం చదువు ఉద్యోగ విషయాలపై ఆలోచిస్తారు. రాజకీయ నాయకులకు ఆందోళనలు అధికమవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు అకారణంగా మాటపడవలసి వస్తుంది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది.
 
కుంభం :- రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. విద్యార్థులకు ప్రేమ వ్యవహరాలు అనుకూలించవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కుంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోయే ఆస్కారం ఉంది.
 
మీనం :- ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోయే అవకాశం ఉంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. స్త్రీలకు బంధువులతో పట్టింపులు అధికమవుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాబడికి మంచిన ఖర్చులెదురైనా ఇబ్బందులేమాత్రంఉండవు.