బుధవారం, 29 నవంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-09-2023 శనివారం రాశిఫలాలు - అనంతపద్మనాభస్వామిని పూజించిన శుభం...

Aries
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు॥ అష్టమి ఉ.7.43 నవమి తె.5.57 మూల ఉ.11.42 ఉ.వ.10.09 ల 11.42, రా.వ.8.52ల 10.24. ఉ.దు. 5.48 ల 7.28.
 
అనంతపద్మనాభస్వామిని పూజించిన శుభం జయం చేకూరుతుంది.
 
మేషం :- ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించడం మంచిది. భాగస్వామిక, వాణిజ్య ఒప్పందాలు మెరుగుపడతాయి. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. మొహమాటం, మెతకదనం వీడి నిక్కచ్చిగా వ్యవహరిస్తేనే అనుకున్నది సాధ్యమవుతుంది. పెద్దల ఆర్యోగం గురించి ఆందోళన చెందుతారు.
 
వృషభం :- కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. స్థిరాస్తికి సంబంధించిన చర్చలు సత్ఫలితాలనివ్వవు. విలువైన వస్తువులు, ఆభరణాలు అమర్చుకుంటారు. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి. వృత్తుల వారికి స్వల్ప చికాకులు మినహా సమస్యలుండవు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసివస్తుంది. 
 
మిథునం :- శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు, నేర్పు ఎంతో అవసరం. ప్రేమికుల మధ్య అపార్ధాలను తొలగిపోతాయి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారు అచ్చుతప్పులు పడుటవలన మాటపడక తప్పదు. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. కళ, క్రీడా రంగాల వారికి మంచి గుర్తింపు, ఆదరణ లభిస్తాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. విద్యార్థులు తోటివారి వల్లమాటపడక తప్పదు. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ప్రముఖుల కలయిక మీ పురోభివృద్ధికి తోడ్పడుతుంది.
 
సింహం :- ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యులతో సంభాషించేటపుడు ఆచి, తూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. ఉద్యోగస్తులు, ధనప్రలోభాలకు దూరంగా ఉండాలి.
 
కన్య :- మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల సరదాలు, మనోవాంఛలు నెరవేరుతాయి. చేపట్టిన వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. దైవ, పుణ్యకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగ రీత్యా దూరప్రయాణం చేయవలసివస్తుంది. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి.
 
తుల :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. బంధువుల రాకవల్ల చేపట్టిన పనులు అర్థాంతంగా ముగించాల్సి వస్తుంది. వాహన యోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. తలపెట్టిన పనిలో ఒత్తిడి, చికాకులు అధికమైన సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి.
 
వృశ్చికం :- ఉద్యోగుస్తులకు సభలు, సత్కార్యాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టుల విషయంలో పునరాలోచన మంచిది. ఇతరులపై ఆధారపడక మీ వ్యవహారాలు స్వయంగా సమీక్షించుకోవటం క్షేమదాయకం. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లలో ఊహించని సమస్యలెదురవుతాయి.
 
ధనస్సు :- ఇతరులకు వాహనం ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. సోదరులతో స్వల్ప అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. రుణప్రయత్నం వాయిదా పడగలదు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల చికాకులు అధికమవుతాయి. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు పనిభారం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మకరం :- స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పంతం అధికమవుతుంది. గట్టిగా ప్రయత్నిస్తేనే మొండిబాకీలు వసూలవుతాయి. రవాణా రంగంలోని వారికి చికాకులు ఎదుర్కొంటారు. నరాలు, కళ్ళు, తలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. చేస్తున్న పనులు పూర్తి అవుతున్న చివరి క్షణంలో విసుగు, భారమనిపిస్తాయి.
 
కుంభం :- వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమించాలి. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం అందుతుంది. రెట్టించిన ఉత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు. వైద్యులకు శస్త్ర చికిత్స చేయునపుడు మెళకువ అవసరం. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. ఓర్పు, నేర్పుతో అనుకున్నది సాధిస్తారు.
 
మీనం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యవసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దుబారా ఖర్చులు తగ్గకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. దంపతుల మధ్య సఖ్యత లోపం, చికాకులు తలెత్తుతాయి. చిన్న చిన్న పొరపాట్లు దొర్లినా సమర్థించుకుంటారు. సంఘంలో కీర్తి గౌరవాలు ఇనుమడిస్తాయి.