సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2023 (22:52 IST)

24-09-2023 నుంచి 30-09-2023 వరకు మీ వార రాశిఫలాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము
ప్రతికూలతలను అధిగమిస్తారు. సంప్రదింపులు ఫలిస్తాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదివారం నాడు ముఖ్యుల కలయక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఉద్యోగ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. అధికారులకు మీపై సదాభిప్రాయం కలుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణిస్తారు. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
వృషభం: కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు
ఇతరుల మేలు కోరి చేసిన మీ వాక్కు ఫలిస్తుంది. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం, వాహనయోగం పొందుతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాలు కలిసిరావు. సోమ, మంగళవారాల్లో పనులు అనుకున్న విధంగా సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. వాస్తుదోష నివారణ చర్చలు సత్ఫలితమిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. నిరుద్యోగులకు శుభయోగం. ట్రాన్స్‌పోర్టు రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు
ఈ వారం అనుకూలదాయకమే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. సంస్థల స్థాపనలకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. వివాహయత్నం ఫలిస్తుంది. నిశ్చితార్ధంలో జాగ్రత్త. స్తోమతకు మించి హామీలివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. గృహాలంకరణల పట్ల ఆసక్తి పెంపొందుతుంది. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి. సహోద్యోగులతో ఉల్లాసంగా గడుపుతారు. కొత్త పరిచయాలేర్పడతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1, 2, 3, 4 పాదములు
ప్రతి విషయంలోనూ మీదే పైచేయి. వ్యతిరేకులను సైతం ఆకట్టుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అంచనాలను మించుతాయి. మీ ఉన్నతి చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. పనులు చురుకుగా సాగుతాయి. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. దళారులతో జాగ్రత్త. ఉద్యోగస్తుల కష్టం ఫలిస్తుంది. పురస్కారాలు, ప్రశంసలందుకుంటారు. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ పథకాలు త్వరలో సత్ఫఫలితాలిస్తాయి. సభలు, కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆశావహదృక్పథంతో యత్నాలు సాగించండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి. ఖర్చులు అధికం. బుధవారం నాడు ధన సమస్యలు ఎదురవుతాయి. ఆప్తులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. గృహమార్పు యత్నాలు సాగిస్తారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
బంధుమిత్రుల విమర్శలు పట్టుదలను రేకెత్తిస్తాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. లక్ష్యసాధకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కార్యదీక్ష స్ఫూర్తిదాయకమవుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. శుక్ర, శనివారాల్లో వ్యవహార ఒప్పందాల్లో మెళకువ వహించండి. భేషజాలు, మొహమ్మాటాలకు పోవద్దు. నోటీసులు అందుకుంటారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. ఉద్యోగ బాధ్యతల్లో తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. సరుకు నిల్వలో జాగ్రత్త.
 
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
కష్టేఫలి అన్న సత్యాన్ని గుర్తిస్తారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. సహాయం అర్ధించేందుకు మనస్కరించదు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాగ్రత్త. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఓర్పుతో పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. కావలసిన వస్తువులు సమయానికి కనిపించవు. చీటికిమాటికి అసహనం చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారదక్షతతో రాణిస్తారు. వస్తులాభం, వాహనయోగం ఉన్నాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. ఆహ్వానం అందుకుంటారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. మంగళవారం నాడు నగదు, ఆభరణాలు జాగ్రత్త. నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. జాతక పొంతన ప్రధానం. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
అన్ని రంగాల వారికీ కలిసివచ్చే సమయం. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కష్టం ఫలిస్తుంది. పొదుపు ధనం గ్రహిస్తారు. ఖర్చులు భారమనిపించవు. ఆప్తులకు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. బుధ, గురువారాల్లో అప్రమత్తంగా ఉండాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆత్మీయులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. కనిపించకుండా పోయన వస్తువులు లభ్యమవుతాయి. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ధార్మిక విషయాలపై ఆసక్తి కలుగుతుంది. సామాజిక, దైవకార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శుక్రవారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. ధన వ్యయంలో జాగ్రత్త. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు సాగవు. గృహమార్పు కలిసివస్తుంది. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. కార్మికులకు పనులు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. యత్నాలు కొనసాగించండి. సహాయం ఆశించవద్దు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. శనివారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు తప్పవు. ఆపత్సమయంలో అయిన వారు ఆదుకుంటారు. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు
ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ సమర్ధతపై నమ్మకం కలుగుతుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుతంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మధ్యవర్తులను నమ్మవద్దు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకోగలుగుతారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ధనయోగం.