సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (16:10 IST)

03-09-2023 నుంచి 09.09.2023 వరకు మీ వార రాశి ఫలితాలు

Horoscope
మేషం : అశ్వని, భరణి 1,2,3,4 పాదములు. కృత్తిక 1వ పాదము
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులు కలిసిరావు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పనులు వేగవంతమవుతాయి. అవివాహితులకు శుభదాయకం. ఉల్లాసంగా గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలు అధికమవుతాయి. మంగళ, బుధ వారాల్లో బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. సంస్థల స్థాపనలకు తరుణం కాదు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలించదు. దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు.
 
వృషభం: కృత్తిక 2,3,4 పాదములు, రోహిణి, మృగశిర 1,2, పాదములు
ప్రతికూలతలు తొలగుతాయి. ధైర్యంగా వ్యవహరిస్తారు. వ్యవహారజయం, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఆప్తులకు సాయం అందిస్తారు. పరిచయాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గురువారం నాడు అనుకోని సంఘటనలెదురవుతాయి. సంతానం ధోరణి సమస్యాత్మకమవుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వాస్తుదోష నివారణ అనివార్యం. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు హోదా మార్పు, కొత్త బాధ్యతలు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మిథునం : మృగశిర 3,4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదములు
వ్యవహారదక్షతతో నెట్టుకొస్తారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. శుక్ర, శని వారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం ఉన్నత విద్యాయత్నం ఫలిస్తుంది. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. నిర్మాణాలు వేగవంతమవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప లాభసాటిగా సాగుతాయి. చిరువ్యాపారులకు ఆశాజనకం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. పందాలు, బెట్టింగ్లకు పాల్పడవద్దు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్రేష 1,2,3,4 పాదములు
మీదైన రంగంలో రాణిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, పత్రాలు జాగ్రత్త. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆదివారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే అవకాశం ఉంది. జాతక పొంతన ప్రధానం. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. సంతానానికి ఉన్న విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఉపాధ్యాయులు పురస్కారాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వ్యవసాయ రంగాల వారికి ఆందోళన అధికం. ప్రయాణం తలపెడతారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. పరిచయాలు బలపడతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. మంగళ, బుధ వారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. గృహమార్పు అనివార్యం. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాతవ్యక్తులు మోసగించేందుకు యత్నిస్తారు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు పదోన్నతి, స్థానచలనం. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు
కార్యదీక్షతో శ్రమిస్తే విజయం తధ్యం. యత్నాలకు అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. మనోధైర్యంతో మెలగండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు ఆస్కారం లేదు. సోమవారం నాడు పనులు మందకొడిగా సాగుతాయి. పత్రాల్లో సవరణలు అనుకూలించవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. నిరుద్యోగులకు నిరాశాజనకం. సొంతంగా ఏదైనా చేయాలన్న మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
సంప్రదింపులు ఫలించవు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మనస్సుకు నచ్చిన వారితో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. ఈ చికాకులు తాత్కాలికమే. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. బుధ, గురు వారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పత్రాలు అందుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. సంతానం భవిష్యత్తుపై దృష్టి సారించండి. బంధువులతో స్పర్ధలు తలెత్తుతాయి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కిట్టని వ్యక్తులు తప్పుదారి పట్టించుందుకు యత్నిస్తారు. వృత్తుల వారికి సామాన్యం. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం కాదు. సన్మాన, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సంకల్పం సిద్ధిస్తుంది. కొత్త పరిచయాలేర్పడతాయి. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. మీ వాక్కు ఫలిస్తుంది. ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. ఆది, సోమ వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ప్రణాళికలు నిర్దేశించుకుంటారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. పనివారల వైఖరి అసహనం కలిగిస్తుంది. ఎవరినీ తప్పుపట్టవద్దు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన వ్యాపారాలు కలిసిరావు. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభసమయం. పట్టుదలతో ఉద్యోగయత్నాలు సాగించండి. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి.
 
ధనస్సు: మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం అన్ని రంగాల వారికీ బాగుంటుంది. సమర్థతను చాటుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ధనలాభం ఉంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ధనసహాయం తగదు. అయిన వారితో సంభాషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానానికి శుభఫలితాలున్నాయి. పాత పరిచయస్తులు తారసపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. మీ చొరవతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు. ముఖ్యులలో ఒకరికి వీడ్కోలు పలుకుతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు
ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. దుబారా ఖర్చులు తగ్గించుకుంటారు. పెట్టుబడులు అనుకూలించవు. బంధుమిత్రులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లు, కార్మికులకు కష్టకాలం. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాన్నిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. అధికారులకు హోదామార్పు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పోటీల్లో విజయం సాధిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3,4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1,2,3 పాదములు
సత్కాలం సమీపిస్తోంది. ఆశావహదృక్పథంతో మెలగండి. యత్నాలు కొనసాగించండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు వాయిదా వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. మంగళవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. వాగ్వాదాలకు దిగవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సంతానం వైఖరి ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఆందోళన తగిటపడతారు. ఉపాధ్యాయులకు పదోన్నతి. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధి పథకాలు కలిసివసాయి. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర, రేవతి 1,2,3,4 పాదములు
కార్యసిద్ధికి ఓర్పు ప్రధానం. బంధుమిత్రులు విమర్శలు పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. బుధ, గురు వారాల్లో కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వాస్తుదోష నివారణ చర్యలు సత్ఫలితాలిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. నిశ్చితార్ధంలో ఏకాగ్రత వహించండి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. చిరువ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వైద్య, సేవ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ధార్మిక విషయాలపై ఆసక్తి పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.