Shukra Vakri 2023: ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
శుక్ర వక్రీ కారణంగా ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. అపారమైన డబ్బు సంపాదించవచ్చు శుక్ర వక్రీ 2023 ఈ మూడు రాశుల వారికి అదృష్టవంతులు ఎక్కువ డబ్బు పొందుతారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
జ్యోతిష్య ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా తమ గమనాన్ని మార్చుకుంటాయి. గ్రహాల రాశి పరివర్తన నేరుగా 12 రాశిపై మంచి, చెడు ప్రభావాలను చూపుతుంది.
తాజాగా శుక్రుడు జూలై 22న కర్కాటకరాశిలో తిరోగమనం చెందుతాడు. ఇది మూడు రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆ అదృష్టకర రాశులు ఏంటో చూద్దాం..
మేషరాశి
శుక్రుని సంచారం మేష రాశికి మేలు చేస్తుంది. మేషరాశి వ్యక్తుల అదృష్టం మారవచ్చు. వారికి జీతం పెరగవచ్చు. చాలా డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో ఈ రాశి జాతకులు ఇల్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది.
మిథునరాశి
శుక్రుని తిరోగమన కదలిక మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. వారికి ఉన్నట్టుండి డబ్బు అందుకోవచ్చు. ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయంతో మేలు జరుగుతుంది. దీంతో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
తులారాశి
శుక్రుని తిరోగమన సంచారం వల్ల తులారాశికి మేలు జరుగుతుంది. విద్యా, ఉద్యోగ రంగాలలో పురోగతికి అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాలలో ధనలాభం ఉంటుంది. ఈ కాలంలో వారు డబ్బు సంపాదించడానికి అనేక కొత్త అవకాశాలను పొందవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.