బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 21 జూన్ 2023 (22:55 IST)

కోరుకున్న ఉద్యోగాన్నిచ్చే కర్పూరవల్లి... ఎలాగో తెలుసా?

karpooravalli
karpooravalli
కోరుకున్న ఉద్యోగం లభించాలంటే.. విఘ్నేశ్వరుడిని ఇలా ప్రార్థించాలని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. అదేంటో చూద్దాం.. కోరుకున్న ఉద్యోగం అందరికీ లభించక.. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. అప్పటి వరకు దొరికిన ఉద్యోగం చేస్తుంటారు. అయితే ఆదిదేవుడైన వినాయకుడిని పూజిస్తే కోరుకున్న ఉద్యోగం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు.
 
వినాయకుడికి కర్పూరవల్లి ఆకులు అంటే చాలా ఇష్టం. అందుచేత ప్రతి బుధవారం లేదా సంకష్టహర చతుర్థి రోజున కర్పూరవల్లి ఆకులను మాలగా సమర్పిస్తే.. కోరుకున్న ఉద్యోగం లభిస్తుందని చెబుతారు. కర్పూరవల్లి ఆకులు లభించని పక్షంలో గణపతికి ఎరుపు రంగు అరటి పండ్లను నైవేద్యంగానూ లేకుంటే మాలలా అలంకరించి ధరిస్తే మంచి ఫలితాలు వుంటాయి. 


Red Banana
Red Banana 
 
ఇలా 12 వారాల పాటు వినాయకుడిని పూజించడం ద్వారా కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. ప్రతి బుధవారం ఉపవాసం ఉండి, విఘ్నేశ్వరుడిని మనస్పూర్తిగా పూజిస్తే వచ్చే ఉద్యోగంలో ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయనేది విశ్వాసం.