బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 9 మే 2023 (22:39 IST)

ఈశాన్యం ఇలా వుంటేనే.. చేతిలో డబ్బు నిలుస్తుందట!

Vastu purush
కొన్నిసార్లు కష్టపడి పనిచేసినా చేతిలో డబ్బు నిలవదు. ఇది కొన్ని వాస్తు సంబంధిత సమస్యల వల్ల కూడా జరగవచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిక్కు సంపదకు సంబంధించింది. ఈ దిశలో భారీ వస్తువులను ఉంచినట్లయితే లేదా ఈ దిశలో చాలా ధూళి ఉంటే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. 
 
ఇంటికి ధనం రాబడి వుండదు. అదేవిధంగా, ఈశాన్య దిక్కు అన్ని వేళలా చీకటిగా ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండవచ్చు. కాబట్టి ఈ దిశలో ఎల్లప్పుడూ కాంతి ఉండాలి. 
 
ఈశాన్య దిక్కును కుబేరుడు పరిపాలిస్తాడు. అందువల్ల, చీపుర్లు, చెత్త డబ్బాలు, భారీ ఫర్నిచర్ వస్తువులు వంటి ప్రతికూల శక్తిని కూడబెట్టే అన్ని అడ్డంకులు ఈ దిశలో వుంచకూడదు. వాస్తు దోష నివారణకు వాస్తు పిరమిడ్‌ను ఈశాన్యంలో ఉంచాలి. 
 
ఈశాన్యం జ్ఞానం, అభ్యాసానికి ప్రతీక. విద్యార్థులకు కలిసొస్తుంది. తూర్పు, ఈశాన్యం లేదా ఉత్తరం వైపు చూసే విధంగా స్టడీ టేబుల్ తప్పనిసరిగా ఉంచాలి. ఇక్కడ అనుకూలమైన శక్తులు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.