పెళ్లయిన కొత్తలో.. వాస్తు ప్రకారం ఏ గది మంచిది? (Video)
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం ద్వారా శుభఫలితాలను పొందవచ్చు. అలాగే పిల్లలు చదువుకునే స్టడీ రూమ్ వాస్తు ప్రకారం నిర్మించడం ద్వారా వారి భవిష్యత్ మెరుగ్గా వుంటుందని వాస్తు నిపుణులు అంటున్నారు
స్టడీ రూమ్ ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉండాలి. చదువుకునే పిల్లలు లేదా పెద్దలు తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోవడం మంచిది. నైరుతి అంటే కుబేర మూలలో ఉన్న పడకగదిలో కుటుంబ పెద్దలుగా ఉండటం మంచిది.
నైరుతి పడకగది యువ వివాహిత జంటలకు కలిసివస్తుంది. ఇంట్లో వృద్ధులకు, పాఠశాలకు వెళ్లే పిల్లలకు ఈశాన్య దిశలో గదిని ఏర్పాటు చేయవచ్చు.
అతిథులు ఇంటికి వచ్చినప్పుడు బస చేసేందుకు వాయువ్య దిశలో అతిథి గదిని ఏర్పాటు చేసుకోవచ్చునని వాస్తునిపుణులు అంటున్నారు.