మంగళవారం, 16 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 నవంబరు 2022 (11:40 IST)

స్వస్తిక్ గుర్తుతో కష్టాలు పరార్.. బంగారం, వెండి స్వస్తిక్ ఉంగరం ధరిస్తే?

swasthik
మీ ఇంట ప్రతికూల పరిస్థితులు మానసిక, శారీరక పరిస్థితులు కుంగదీస్తున్నప్పుడు ఇంటి గుమ్మానికి స్వస్తిక్ గుర్తు వుంచాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ఇంటి తలుపు దగ్గర స్వస్తిక్ గుర్తును వుంచడం ద్వారా అన్ని రకాల విఘ్నాలు తొలగిపోతాయి. విజయాలు చేకూరుతాయి. 
 
ఇలా చేస్తే కష్టనష్టాలుండవు. అనారోగ్యాలు తొలగిపోతాయి. బాధలు వుండవు. జీవితంలో అసలైన అభివృద్ధి చేకూరుతుంది. ఈ స్వస్తిక్ నాలుగు దిశలను సూచిస్తుంది. బ్రహ్మదేవుని శక్తి స్వస్తిక్‌లో వుంటుంది. 
 
స్వస్తిక్ కంటి దిష్టిని ఇంటిపై పడనివ్వదు. ఇది ఇంటి యజమానికి సానుకూల శక్తిని, అదృష్టాన్ని తెస్తుంది. అలాగే వారి పనుల్లోని అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.
 
ప్రాచీన కాలం నుండి వినాయకుని చిహ్నమైన స్వస్తిక్ పవిత్రమైన వస్తువుగా ఉపయోగించబడింది.
 
మీ ఇల్లు లేదా కార్యాలయం ఈశాన్య మూలలో మీ పూజా స్థలంలో స్వస్తిక్ ఉంచండి. లేదా పడమర దిశలో గోడకు వేలాడదీయండి. మీరు ఒత్తిడితో బాధపడుతూ, దాని నుండి బయటపడలేకపోతే రోజుకు 10 నిమిషాలు స్వస్తిక్ ధ్యానం చేయడానికి ప్రయత్నించండి.

ఉద్యోగంలో విజయం సాధించాలనుకుంటే, మీరు బంగారం లేదా వెండితో చేసిన స్వస్తిక్ ఉంగరాన్ని ధరించవచ్చు. ఆఫీసులో కానీ ఇంట్లో కానీ మెరుగైన ఫలితాల కోసం స్వస్తిక్‌ను వుంచడం చేయాలని వాస్తు శాస్త్రం చెప్తోంది.