గురువారం, 23 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 ఆగస్టు 2023 (17:43 IST)

భైరవుడిని పూజిస్తే.. నవగ్రహ దోషాలుండవ్ తెలుసా?

ఆది భైరవుడి నుంచి అష్టాంగ భైరవ, ఊరుభైరవ, చండ భైరవ, కురోదన భైరవ, ఉన్మత్త భైరవ, కాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవుడు జనించినట్లు పురాణాలు చెప్తు్న్నాయి. జ్యోతిషశాస్త్ర గ్రంథాలు భైరవుడిని కాలపురుషుడు అని సూచిస్తాయి. పన్నెండు రాశులు అతని చిత్రంలో భాగాలుగా మారాయి. 
 
మేషం-శిరస్సు, వృషభం-నోరు, మిథునం-చేతులు, కర్కాటకం-ఛాతీ, సింహం-ఉదరం, కన్యా-బొడ్డు, వృశ్చికం-లింగం, ధనుస్సు-తొడలు, మకరం-మోకాలు, కుంభం- కింది కాళ్లు, మీనం-అరికాళ్లు. భైరవుడు రాజు అయితే, గ్రహాలు ఆయన ఆజ్ఞలను అమలు చేసే సేవకులు. భైరవుని ఆజ్ఞ మేరకు కాలచక్రం తిరుగుతుంది.
 
గ్రహాలన్నీ ఆయన ఆజ్ఞ ప్రకారం పనిచేస్తాయి. అందుకే భైరవుడికి శరణాగతియై మనస్పూర్తిగా పూజిస్తే కాల నియంత్రణను అధిగమించి గ్రహదోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శనివారం పూట కాలభైరవునికి దీపం వెలిగిస్తే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇంకా అష్టమి తిథుల్లో ఆయనను పూజిస్తే నవగ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.