బుధవారం, 29 నవంబరు 2023
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-09-2023 శుక్రవారం రాశిఫలాలు - లక్ష్మీదేవిని ఆరాధించిన శుభం...

astro6
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద శు|| పూర్ణిమ సా.4.09 ఉత్తరాభాద్ర రా.1.20 ఉ.వ.11.49 ల 1.19. ఉ. దు. 8.17 ల 9.07 ప.దు. 12.25 ల1.15. లక్ష్మీదేవిని ఆరాధించిన శుభం 
 
మేషం :- ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులు ఇతరుల ఆంతరంగిక విషయాల్లో తలదూర్చడం వల్ల మాటపడతారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. దైవ, సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ప్రేమికులకు సన్నిహితుల ప్రోత్సాహం లభిస్తుంది.
 
వృషభం :- రాజకీయాలలోని వారికి ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తలెత్తుతాయి. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. మీరు చేపట్టిన పనికి ఇతరుల నుంచి అవాంతరాలు ఎదుర్కుంటారు.
 
మిథునం :- విదేశాలు వెళ్ళే ఆలోచన క్రియారూపం దాల్చుతుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కోర్టు వ్యవహరాలు ఒక కొలిక్కి రాగలవు. గతానుభవాలు జ్ఞప్తికిరాగలవు. కళ, క్రీడ, సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కర్కాటకం :- కాంట్రాక్టర్లకు నిర్మాణవ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. స్థిరాస్తి కొనుగోలు యత్నం వాయిదా పడటం మంచిది. ఉత్తర ప్రత్యుత్తరాలలో మెళకువ వహించండి. దైవదర్శనాలు చేస్తారు. చిన్నతరహా, చిరువృత్తుల వారికి శ్రమాధిక్యత. ఆర్ధిక సంతృప్తి కానరాదు. హామీలు ఉండటం మంచిది కాదని గ్రహించండి.
 
సింహం :- బంధువర్గాల నుండి ఒక ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. అనుకున్న పనులు ఆశించినంత సంతృప్తినివ్వవు. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహించండి. ప్రయాణాలు, మీ కార్యక్రమాలు వాయిదా పడటం మంచిది.
 
కన్య :- వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ రంగాల్లో వారికి కలిసిరాగలదు. స్త్రీలకు ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. సంగీత, సాహిత్య, కళారంగాల్లో వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. స్పెక్యులేషన్ రంగాల వారికి కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయడం వల్ల భంగపాటుతప్పదు.
 
తుల :- వివాహాది శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో అప్రమత్తంగా వ్యవహరించడంమంచిది. ఆస్తివివాదాల నుండి బయటపడతారు. వైద్య రంగాల్లో వారికి శస్త్రచికిత్సల విషయంలో ఏకాగ్రత అవసరం. ఆత్మీయుల క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. ఆత్మీయులరాకతో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది.
 
వృశ్చికం :- వస్త్ర, బంగారం వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఉమ్మడి వ్యవహరాలు, భాగస్వామిక వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్లు పొందుతారు. సాహిత్య, కళారంగాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ ఆలోచనల్లో మార్పువస్తుంది.
 
ధనస్సు :- స్థిర, చరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు తోటివారితో మెళకువ అసవరం. బంధు, మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో అలక్ష్యం తగదు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహా మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
 
మకరం :- ఆర్థిక విషయాల్లో కొంత సంతృప్తి కానవస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేయగలుగుతారు. భూవివాదాలు, స్థిరాస్తి వ్యవహారాల విషయంలో జాగ్రత్త వహించండి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. చిన్నతరహా, వృత్తి వ్యాపారాలు సజావుగా జరుగుతాయి. మీ జీవితభాగస్వామిలో మార్పు మీకెంతో ఊరటనిస్తుంది.
 
కుంభం :- వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్యల గురించి అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కాంట్రార్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి తప్పదు. స్టాక్ మార్కెట్ రంగాల్లో వారికి మిశ్రమ ఫలితం. స్వల్ప అసస్థతకు గురవుతారు. విద్యార్థులకు ఉన్నత చదువుల్లో అవకాశం లభిస్తుంది.
 
మీనం :- స్త్రీల అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి. నూతన పెట్టుబడులు, వ్యాపారాల విస్తరణలకు మరికొంత కాలం వేచియుండటం మంచిది. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. కోర్టు వ్యవహారాలు సుదీర్ఘంగా సాగుతాయి.