శనివారం, 28 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

03-10-2023 మంగళవారం రాశిఫలాలు - లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి...

astro11
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద బ|| చవితి ఉ.9.36 కృత్తిక రా.10.24 ఉ.వ.10.29 ల 12.04. ఉ. దు. 8.16 ల 9.04 రా.దు. 10.37 ల 11.26.
లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి, పురోభివృద్ధి పోందుతారు.
 
మేషం :- ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. పాత వస్తువులను కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. తల్లి, తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన అధికం అవుతుంది. రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
వృషభం :- సాహిత్యాభిలాష పెరుగుతుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. ప్రేమికుల ఆలోచనలు పెడదారి పట్టే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తుల సమర్థత, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. గృహంలో వస్తువు పోవడానికి అవకాసం ఉంది జాగ్రత్త వహించండి.
 
మిథునం :- వృత్తి, వ్యాపారాలలో శుభపరిణామాలు సంభవిస్తాయి. ప్రకటనలు, రాజకీయ కళా రంగాల వారికి ప్రోత్సహకరం. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. మీ సంతానం గురించి ఆందోళన చెందుతారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ఖర్చులు, చెల్లింపులు ఆందోళన కలిగిస్తాయి.
 
కర్కాటకం :- వ్యాపారాభివృద్ధికి చేయు కృషి ఫలిస్తుంది. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. పత్రికా సంస్థలో వారికిపనిభారం అధికం. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు.
 
సింహం :- ప్రత్తి, పొగాకు, చెరకు రైతులకు సంతృప్తి కాన వస్తుంది. గృహంలో ఏవన్నావస్తువులు పోవుటకు ఆస్కారంకలదు. పాత జ్ఞాపకాలు గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. ఆకస్మికంగా పొట్ట, తలకి సంబంధించిన చికాకులు తలెత్తుతాయి. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి.
 
కన్య :- మీకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీ కదలికలపై నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. ఉపాధ్యాయులకు విశ్రాంతి లోపం వల్ల అలసట అధికమవుతుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం.
 
తుల :- సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం సందడి చోటు చేసుకుంటాయి. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. సోదరి, సోదరులతో అవగాహన కుదరదు. రుణాల కోసం అన్వేషిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
 
వృశ్చికం :- రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు ఆందోళన అధికమవుతుంది. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగంచేసుకోండి. ముఖ్యంగా ప్రింట్, మీడియాలో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదా పడుతున్న పనులు పునఃప్రారంభం అవగలవు.
 
ధనస్సు :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. పెద్దల ఆర్యోగం పట్ల శ్రద్ధ చూపిస్తారు. వేతనం తక్కువైనా వచ్చిన అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవటం శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కార్యాలయంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పెంపుడు జంతువులపైప్రేమ, శ్రద్ద చూపిస్తారు.
 
మకరం :-స్త్రీలకు షాపింగ్ ల్లో నాణ్యతను గమనించాలి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలుతలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, ఆరోగ్యంలో మెలకువ వహించండి. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
కుంభం :- మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. చేతివృత్తుల వారికి ఒత్తిడి, పని భారం తగ్గుంది. ఆలయాలను సందర్శిస్తారు. వాహనం ఇచ్చేవిషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ పాతసమస్యలు పరిష్కారం కాకపోవటంతో ఒకింత నిరుత్సాహానికి గురవుతారు.
 
మీనం :- ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వ చేయలేకపోతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదుర్కోవలసివస్తుంది. గృహ నిర్మాణాలలో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కొంటారు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారన్న విషయం గమనించండి. విద్యార్థులు వాహనం నడుపునప్పుడు మెళకువ అవసరం.