శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 అక్టోబరు 2023 (21:27 IST)

పితృపక్షం: 15 రోజుల పాటు ఇలా చేస్తే.. అంతా జయమే..

మరణించిన మూడు తరాల పూర్వీకులు పితృలోకంలో వుంటారని విశ్వాసం. పితృపక్షంలో యమధర్మరాజు పితృదేవతలను వారి బంధువులను సందర్శించేందుకు.. వారిచ్చే ఆహారాన్ని స్థూక్ష్మ రూపంలో పొందే అవకాశాన్ని కల్పిస్తారు. 
 
పితృ పక్షం ప్రతిఏటా 15 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ సమయంలో ప్రజలు సాధారణంగా గంగా లేదా ఇతర పవిత్ర నదుల ఒడ్డున పితృదేవతలకు పిండప్రదానం చేస్తారు. 
 
అలాగే ఈ ఏడాది 16 రోజుల కాలం పితృపక్షంగా మారింది. ఇది భాద్రపద మాసంలో వస్తుంది. పితృ పక్షం సెప్టెంబర్ 29న ప్రారంభమై అక్టోబర్ 14న ముగుస్తుంది. ఈ ఏడాది 16 రోజుల పాటు ఈ పితృపక్షం వుంటుంది. ఈ రోజుల్లో పితృదేవతలను స్తుతిస్తే సర్వం శుభం జరుగుతుంది. అన్నింటా విజయం వరిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.