గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (20:20 IST)

రక్షాబంధన్ : అక్కలకు పాదాభివందనం చేసిన సీఎం కేసీఆర్

KCR
KCR
తెలంగాణ సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్‌లో రక్షాబంధన్‌ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ప్రేమ, ఆప్యాయతలను పంచుకునేందుకు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తరలిరావడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాసం పండుగ వాతావరణం నెలకొంది. 
 
రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టుకుని వేడుకల్లో పాల్గొన్నారు.
 
ముఖ్యమంత్రి అక్కలు శ్రీమతి లక్ష్మీబాయి, జయమ్మ, లలితమ్మ తన చెల్లెలు శ్రీమతి వినోదమ్మతో కలిసి ఆయన మణికట్టుకు రాఖీలు కట్టి తమ బంధానికి ప్రతీకగా నిలిచారు. ముఖ్యమంత్రి ఆశీస్సులు కూడా కోరారు.
 
ఈ వేడుకను చూసేందుకు సీఎం కేసీఆర్ సతీమణి శ్రీమతి శోభమ్మ, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అక్కయ్యలకు పాదాభివందనం చేశారు.