రాఖీ గిఫ్ట్.. ఎల్పీజీ సిలిండర్‌పై రూ.200ల సబ్సీడీ
ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలకు ముందు ఒక ముఖ్యమైన చర్యగా, కేంద్ర క్యాబినెట్ అన్ని గృహ ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 సబ్సిడీని ప్రకటించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ నిర్ణయం మహిళలకు రక్షా బంధన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమతిగా పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఉజ్వల యోజనా పథకం లబ్ధిదారులకు ఈ ప్రయోజనం దక్కనుంది. ఇప్పటికే కేంద్రం ఎల్పీజీ సిలిండర్లపై రూ.200 రాయితీ ఇస్తోంది. ఇప్పుడు అదనంగా రూ.200 వరకు తగ్గించనుంది.
దాంతో పీఎంయూవై లబ్ధిదారులు ఒక్కో సిలిండర్‌పై రూ.400 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుత తగ్గింపుతో కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.6100 కోట్లు, 2023-24లో రూ.7680 కోట్ల భారం పడుతుందని అంచనా.