శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2023 (09:19 IST)

ఉల్లిధరల పెంపు.. రంగంలోకి దిగిన కేంద్రం.. ఏం చేసిందంటే?

onion
టమోటా ధరలు దేశ ప్రజలకు చుక్కలు చూపించాయి. దీంతో దేశ ప్రజలు నానా తంటాలు పడ్డారు. ఇక ఉల్లి ధరలు కూడా పెరగడంతో.. ఉల్లిపాయల ధరలను కట్టడి చేసేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా గోదాముల్లో స్టాక్ చేసిన ఉల్లిపాయలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 
 
దేశంలోని పలు రాష్ట్రాల్లో వున్న గోదాముల్లో నిల్వ చేసిన ఉల్లిని మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఈ-వేలం, ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు చెప్పింది. 
 
ఇప్పటికే ధరల నియంత్రణకు కేంద్రం ఉల్లిని సేకరించి బఫర్ స్టాక్‌గా గోదాముల్లో నిల్వ ఉంచుతుంది. ఈ ఏడాది 3 లక్షల టన్నుల మేర ఉల్లి సేకరణ జరిగింది. ఈ ఉల్లిపాయలను ప్రస్తుతం మార్కెట్లోకి తెచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది.