గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 ఆగస్టు 2023 (20:10 IST)

గుండెకు బలం-అరగంట వాకింగ్.. రోజుకు ఒక కప్పు పెరుగు

Heart health
గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. వయోబేధం లేకుండా గుండెపోటుతో మృతి చెందేవారి సంఖ్య పెరుగుతోంది. ఉన్నట్టుండి గుండెపోటు రావడం కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోవడం వంటివి జరిగిపోతున్నాయి. 
 
అందుకే బలమైన గుండె కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలి... సహజ సిద్ధమైన ఆహారంతో గుండెను ఎలా కాపాడుకోవాలో చూద్దాం.. వాకింగ్ అనే చాలా సులభమైన రోజువారీ వ్యాయామం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గుండెను బలంగా వుంచుకోవాలంటే రోజుకు కనీసం అరగంట ఒక మితమైన వేగంతో నడవండి. 
 
అలాగే జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది గుండెకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా 
ఉల్లి రక్తాన్ని పలుచన చేస్తుంది. ఇంకా కొవ్వును కరిగించే గుణాలు ఉన్నాయి.
 
కాబట్టి రోజూ 25 గ్రాముల నుంచి 50 గ్రాముల ఉల్లిపాయను తీసుకోవడం వల్ల గుండె కవాటాల్లో రక్తప్రసరణ సులువుగా జరగడంతో పాటు కొవ్వు కూడా కొద్దికొద్దిగా కరిగి గుండె కవాటాల అడ్డంకిని నయం చేస్తుంది.
 
5 వెల్లుల్లి రెబ్బలను పాలలో కలుపుకుని ప్రతిరోజూ తాగితే గుండెకు బలం చేకూర్చిన వారమవుతాం. 
ఇంకా ఒక కప్పు నిమ్మరసం, ఒక కప్పు వెల్లుల్లి రసం, ఒక కప్పు అల్లం రసం, ఒక కప్పు ఆపిల్ పళ్లరసం సమాన పరిమాణంలో వేసి 30 నిమిషాలు ఉడకబెట్టాలి. 
 
బాగా మరిగాక చల్లారనివ్వాలి. ఆ తర్వాత దానికి సమాన మోతాదులో తేనె వేసి సీసాలో భద్రపరుచుకుని రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కి ముందు ఒక టేబుల్‌స్పూను తీసుకుంటే గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాలలో ఏర్పడే కొవ్వు తొలగిపోతుంది. 
 
5 వెల్లుల్లి రెబ్బలను పాలలో కలుపుకుని ప్రతిరోజూ తాగినా గుండెకు మేలు జరుగుతుంది. రోజూ ఒక కప్పు పెరుగు తింటే గుండె బలంగా మారుతుంది. అల్లం రసంలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.