బుధవారం, 4 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2023 (09:58 IST)

టమోటాలకు తోడు ఉల్లి ధరలు కూడా పెరుగుతాయట!

onion
టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్న నేపథ్యంలో.. ఇక టమోటా ధరలకు ఉల్లి ధరల పెంపు కూడా తోడు కానుంది. ఆగస్టు, సెప్టెంబరు వర్షపాతంపై ఉల్లి ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ నెలాఖరుకు ఉల్లి ధర కిలో రూ. 60-70కి చేరుకునే అవకాశం ఉందని ‘క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ పేర్కొంది. 
 
రబీ ఉల్లి నిల్వ ప్రకారం 1-2 నెలలు తగ్గినట్లు క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ తెలిపింది. సరఫరా-డిమాండ్ మధ్య అసమతౌల్యం ఉందని, ఇది ఆగస్టు నాటికి కనిపించవచ్చని తెలిపింది. 
 
ఫలితంగా సెప్టెంబరు నాటికి ధరలు పెరగొచ్చని అంచనా వేసింది. ఖరీఫ్‌లో దిగుబడులు పెరిగితే  ధరలు మళ్లీ తగ్గుముఖం పడతాయని క్రిసిల్ వెల్లడించింది.