బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 6 జూన్ 2023 (20:35 IST)

దేశంలో తమ 4,500వ సర్వీస్ టచ్ పాయింట్‌ను ఆరంభించిన మారుతి సుజుకీ

image
వాహనాన్ని సొంతం చేసుకునే సమయంలో, కస్టమర్ ఆనందాన్ని నిరంతరంగా పెంచే లక్ష్యంతో, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ (మారుతి సుజుకీ) దేశంలో 4,500 టచ్ పాయింట్స్‌ను చేరడానికి  తమ సర్వీస్ నెట్వర్క్‌ను మరింత విస్తృతం చేసింది.
 
శ్రీ. హిసాషి టకియుచి, మేనేజింగ్ డైరక్టర్ & సీఈఓ, మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ ఇలా అన్నారు, “ఈ గొప్ప విజయాన్ని సాధించినందుకు నేను మా డీలర్ భాగస్వాములు, మారుతి సుజుకీలో సహోద్యోగులను అభినందిస్తున్నాను. ఉన్నతమైన ప్రోడక్ట్స్ మరియు ఆఫ్టర్-సేల్స్ సర్వీస్‌తో కాల క్రమేణా మేము కస్టమర్ విధేయత, నమ్మకం సంపాదించాము. 2,271 పట్టణాలలో 4,500కి పైగా సర్వీస్ టచ్ పాయింట్స్ కస్టమర్ ఆనందాన్ని పెంచాలని మా సంకల్పం. కస్టమర్స్‌కు ‘ప్రయాణపు ఆనందాన్ని అందించడానికి మేము కట్టుబడ్డాము. దీని కోసం కస్టమర్స్‌కు సన్నిహితంగా చేరడానికి మా సర్వీస్ టచ్ పాయింట్స్‌ను విస్తరించడానికి మేము నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నాం, వేగవంతమైన, సరసమైన మరియు ఉన్నతమైన నాణ్యత గల సర్వీస్ అందిస్తున్నాం.”