మణిపూర్ ఘటన : ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలి
మణిపూర్‌లో జరిగిన హింసాత్మక ఘటనలు దేశాన్ని కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. మహిళల్ని నగ్నంగా ఊరేగించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం ఫైర్ అయ్యింది. మే 3నుంచి మణిపూర్‌లో అల్లర్లు జరుగుతుంటే ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారన్నారు.
ఇలాంటి ఘటనలు ఇప్పటికి దేశంలో చాలా జరిగాయని, మణిపూర్‌లో ఎంతమంది చనిపోయారో లెక్క చూపాలని డిమాండ్ చేశారు. ఈ కేసును ధర్మాసనం సుమోటోగా తీసుకుంది.
అంతేకాకుండా బాధిత మహిళల్లో ఒకరి సోదరుడు, తండ్రి మరణించగా.. వారి మృతదేహాలు ఇప్పటికీ కుంటుంబానికి అప్పగించలేదు. ఈ కేసులో దర్యాప్తుకు మహిళా జడ్జితో సిట్ ఏర్పాటు చేయనున్నట్లు ధర్మాసనం వెల్లడించింది.