ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జులై 2023 (15:33 IST)

హైకోర్టు తరలింపుపై మీరే తేల్చుకోండి... : కేంద్రం స్పష్టీకరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని హైకోర్టును కర్నూలు తరలించే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ హైకోర్టులు తేల్చుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అమరావతిలో ఉన్న హైకోర్టును కర్నూలుకు తరలించాలని గత 2020లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారని చెప్పారు. పైగా, ఈ అంశం తమ వద్ద పెండింగ్‌లో లేదని వైకాపా ఎంపీ రంగయ్య అడిగిన ప్రశ్నకు కేంద్రం స్పష్టంచేసింది.
 
హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి ఉమ్మడి నిర్ణయానికి రావాలని కేంద్ర న్యాయ శాఖ పేర్కొందని వైకాపా ఎంపీ తలారి రంగయ్య అడిగిన ప్రశ్నకు శుక్రవారం కేంద్ర క్లారిటీ ఇచ్చింది. అమరావతి నుంచి హైకోర్టును తరలించే ప్రతిపాదన తమ పెండింగ్‌లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు కలిసి పూర్తిస్థాయి ప్రతిపాదన పంపితే కేంద్రం పరిశీలిస్తుందని పేర్కొంది. "హైకోర్టును కర్నూలుకు తరలించాలని గత 2020లో ఏపీ సీఎం ప్రతిపాదించారని, ఈ విషయంలో  హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలని" సూచన చేసింది. 
 
సీఎం మమత ఇంటివద్ద కలకలం.. ఆయుధాలతో చొరబాటుకు యత్నం 
 
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నివాసం వద్ద శుక్రవారం కలకలం చెలరేగింది. కొందరు దుండగులు ఆయుధాలతో ఆమె నివాసంలోకి దూరేందుకు ప్రయత్నించగా, ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అరెస్టు చేసింది. అతడిని నూర్‌ ఆలంగా గుర్తించారు. కోటు, టై ధరించిన అతడు.. పోలీస్‌ స్టిక్కర్‌తో కూడిన వాహనంతో కోల్‌కతా నగరంలోని కాళీఘాట్‌లోని మమతా నివాసంలోకి ప్రవేశించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. అతడిని అరెస్టు చేశారని కోల్‌కతా సీపీ వినీత్ గోయల్ తెలిపారు. ఆ సమయంలో దీదీ తన నివాసంలోనే ఉన్నారు.
 
"ఆ వ్యక్తిని భద్రతా సిబ్బంది అడ్డుకుని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అతడి వద్ద ఒక చాకుతోపాటు వివిధ ఆయుధాలు ఉన్నాయి. గంజాయి కూడా దొరికింది. బీఎస్‌ఎఫ్‌ తదితర ఏజెన్సీలకు సంబంధించిన అనేక గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. అతడు సీఎంను కలవాలనుకున్నాడు. ఇది చాలా తీవ్రమైన విషయం. అతడి ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు యత్నిస్తున్నాం" అని సీపీ వెల్లడించారు. అతడి వాహనాన్ని సీజ్‌ చేసినట్లు తెలిపారు. నగరంలో ఓ ర్యాలీలో పాల్గొనేందుకుగానూ మమతా బెనర్జీ తన నివాసం నుంచి బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ ఘటన జరిగింది.