శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 19 ఆగస్టు 2023 (13:08 IST)

16-18 ఏళ్ల వారిమధ్య పరస్పర అంగీకారంతో శృంగారం..?

romance
16-18 ఏళ్ల వయసులోని వారి మధ్య పరస్పర అంగీకారంతో జరిగే శృంగారాన్ని అత్యాచార నిరోధక చట్టాల కింద నేరంగా పరిగణించరాదని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుంప్రీకోర్టు ఆదేశించింది. 
 
న్యాయవాది హర్ష విబోర్ సింఘాల్ ఈ పిల్ దాఖలు చేశారు. కౌమార దశలోని వారు శారీరక, జీవ, భౌతిక పరమైన అవసరాలు, సమాచారాన్ని విశ్లేషించుకోగలరని.. నిర్భయంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా వారు తమ శరీరాలతో చేయాలనుకున్నది చేసుకోగలిగే అవకాశం ఉండాలని పిటిషనర్ కోరారు.