మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రాహుల్‌పై అనర్హతను ఎత్తివేసిన లోక్‌సభ సచివాలయం

rahul gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మళ్లీ లోక్‌సభలో అడుగుపెట్టనున్నారు. ఆయనపై గతంలో విధించిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం సోమవారం ఎత్తివేసింది. ఈ మేరకు సోమవారం అధికారికంగా ప్రకటించింది. దీంతో ఆయన మళ్లీ సభలో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాల సమావేశాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సమావేశాల్లో రాహుల్ పాల్గొంటారా లేదా అన్నది తేలాల్సివుంది. 
 
మోడీ ఇంటి పేరుతో ఉండేవారంతా దొంగలే అంటూ గత 2013లో జరిగిన కర్నాటక ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. దీనిపై గుజరాత్ మాజీ హోం మంత్రి పూర్ణేష్ మోడీ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ ఈ యేడాది మార్చి 23వ తేదీన దోషిగా నిర్ధారించింది. ఆ మరుక్షణమే రాహుల్ గాంధీపై లోక్‌సభ సచివాలయం అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది. 
 
అప్పటి నుంచి రాహుల్ గాంధీ న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు రాహుల్ పిటీషన్‌పై విచారణ జరిపి... సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల శిక్షా కాలంపై స్టే విధించడంతో పాటు ఎంపీ హోదాను తిరిగి పునరుద్ధరించింది. ఈ మేరకు గత శుక్రవారం అపెక్స్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు తీర్పుతో రాహుల్ తాజాగా తన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పొందగలిగారు.