మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 7 జులై 2023 (14:34 IST)

రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలి.. సుబ్రహ్మణ్య స్వామి

rahul gandhi
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 2019 ఎన్నికల సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సర్ నేమ్ వ్యవహారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై కేసు నమోదైంది. 
 
ఈ కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్షపై రాహుల్ గాంధీ చేసిన అప్పీలును శుక్రవారం తోసిపుచ్చింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఆయన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేస్తే రాహుల్ గాంధీ రెండేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. 
 
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ జైలులో పుస్తకం రాయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.