సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

రాహుల్ గాంధీకి ఊరట.. ఎందుకో తెలుసా?

rahulgandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరోమారు ఊరట లభించింది. పరువు నష్టం దావా కేసులో ఆయనకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను బాంబే హైకోర్టు పొడగించింది. ఆగస్టు 2వ తేదీ వరకు ఆయన ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపును ఇచ్చింది. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ ఇంటి పేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకుగాను బీజేపీ నేత మహేశ్ 2021లో హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. 
 
దీన్ని విచాణకు స్వీకరించి, కేసు విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ గతంలో స్థానిక కోర్టు సమన్లు జారీచేసింది. దీనిని సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల చేపట్టిన జస్టిస్ కొత్వాల్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. తాజాగా మరోమారు మినహాయింపును కోర్టు పొడగించింది. 
 
మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు...
తెలంగాణ రాష్ట్రం మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో  బాధపడుతూ వచ్చిన ఆయన హైదరాబాద్ నగరంలోని ఏజీఎస్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. దయాకర్ రెడ్డి మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యంమత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇతర తెలంగాణ నేతలు, ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
కాగా, దయాకర్ రెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అమరచింత నియోజకవర్గానికి రెండుసార్లు, మక్తల్ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు. అలాగే, తెలుగుదేశం పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు. ఆయన స్వస్థలం పాలమూరు జిల్లాలోని పర్కపురం గ్రామం. అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి.