గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 26 ఆగస్టు 2022 (10:24 IST)

Women's Equality Day: మహిళలకు గౌరవం ఇవ్వని దేశాలు.. ఇంకా..?

Women's Equality Day 2022
Women's Equality Day 2022
మహిళలు ప్రస్తుతం పురుషులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మహిళ అంటే వంటింటికే పరిమితం అయ్యే రోజులు మారిపోయాయి. ఒక్క రంగంలో కాదు... ప్రతీ రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారు. సైకిల్ నుంచి విమానం నడిపేవారిలో మహిళలు వున్నారు. 
 
కానీ ఇంకా మహిళలపై అకృత్యాలు జరుగుతూనే వున్నాయి. మహిళలపై గృహ హింస, అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు కఠినమైన చట్టాలు రావాల్సి వున్నాయి. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాలంటే.. తప్పకుండా సౌదీ తరహాలో కఠిన శిక్షలు రావాల్సిందే. 
 
ఇంకా మహిళలకు సమాన హక్కులు వుంటేనే సమాజం ఎదుగుతుంది. మన దేశంలో మహిళలు ఎదిగేందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. ఐతే... ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వారిపై ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తున్నారు కొందరు. 
అలాంటి వారికి ప్రభుత్వాలు మారాలని.. మహిళలకు అన్నీ రంగాల్లో సమానత్వం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ.. ఇవాళ జాతీయ మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుకుందాం.. ఇంకా ఈ జాతీయ మహిళా సమానత్వ దినోత్సవానికి సంబంధించిన సమాచారాన్ని ఓసారి తెలుసుకుందాం. 
 
1920 ఆగస్ట్ 26న అమెరికా రాజ్యాంగాన్ని 19వ సారి సవరించారు. దాని ప్రకారం... మహిళలకు కూడా ఓటు వేసే హక్కు లభించింది. దాంతో.. మహిళా సమానత్వ దినోత్సవం అప్పుడే మొదలైంది. మహిళలు తమ హక్కుల కోసం అప్పటికే 72 ఏళ్లుగా పోరాడారు. 
 
రకరకాలుగా ఉద్యమాలు చేశారు. అంత చేస్తేగానీ.. పురుషులకు తమ తప్పు తెలిసిరాలేదు. ఆ తర్వాత నుంచి పురుషులు, మహిళలకు హక్కుల విషయంలో సమానత్వం చూపించడం మొదలుపెట్టారు. మొదటిసారి ఈ దినోత్సవాన్ని ఓ సెలబ్రేషన్‌లా 1973లో చేశారు. 
Women's Equality Day 2022
Women's Equality Day 2022
 
1920 నుంచి వందేళ్లలో మహిళలు అన్ని రంగాల్లో తిరుగులేని వృద్ధిని సాధించారు. అయితే మహిళల్లో 70 శాతం మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. వారు రోజూ రూ.80 కూడా సంపాదించలేని స్థితిలో ఉన్నారు.
 
మహిళలు ఎదిగితే.. తమ చుట్టూ ఉన్నవారు ఎదిగేలా వారు చేస్తారు. అది వారి నైజం. అందుకే భారత్ లాంటి దేశాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. మహిళలకు విలువ ఇవ్వని దేశాలు ఇంకా పేదరికం, ఉగ్రవాదం, అరాచక నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి.