సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (23:03 IST)

28-08-2022 నుంచి 03-09-2022 వరకు మీ వార రాశిఫలాలు

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
సంకల్పం సిద్ధిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు విస్తరిస్తాయి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు చేసే అవకాశం లేదు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. మొండిగా పనులు పూర్తి చేస్తారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. దంపతుల మధ్య సమన్వయలోపం. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. సౌమ్యంగా మెలగండి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాలి. షాపుల స్థలమార్పు అనివార్యం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది. దైవకార్యంలో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. మధ్యవర్తులను విశ్వసించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ముఖ్యుల కలయిక వీలుపడదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. గురు, శుక్రవారాల్లో అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. అయిన వారి మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఉపాధ్యాయులకు శుభయోగం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. భవన నిర్మాణ కార్మికులకు ఆశాజనకం. బెట్టింగులు, జూదాల జోలికిపోవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఆర్థికస్థితి సామాన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. గురువారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. ఆప్తులతో సంభాషిస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మానసికంగా కుదుటపడతారు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెట్టండి. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ విషయాల్లో ఇతరుల జోక్యానికి అవకాశమివ్వవద్దు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. అధికారులకు పనిభారం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్త. సేవా, దైవకార్య సమావేశాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనదారులకు దూకుడు తగదు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు
అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరం. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆర్థికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పెట్టుబడులకు తరుణం కాదు. సోమ, మంగళవారాల్లో ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. పత్రాలు, విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
సంకల్పం సిద్ధిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలించవు. దుబారా ఖర్చులు విపరీతం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీ చూడనట్లు వదిలేయండి. పరిచయాలు, వ్యాపకాలు విస్తరిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరుల మధ్య అవగాహన నెలకొంటుంది. పాత పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. మీ సిఫార్సుతో ఒకరికి సదావకాశం లభిస్తుంది. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు, ప్రణాళికలు సత్ఫలితమిస్తాయి. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఆదాయం బాగుంటుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు, నగదు జాగ్రత్త. గృహమార్పు అనివార్యం. పనులు హడావుడిగా సాగుతాయి. ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. సంతానం విషయంలో శుభఫలితాలున్నాయి. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సన్నిహితులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. బాధ్యగలు స్వయంగా చూసుకోండి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఎరువులు, రసాయన వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు ఏరాగ్రత ప్రధానం. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వృత్తి ఉపాధి పథరాల్లో పాల్గొంటారు. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు.
 
తుల : చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆందోళన తగ్గి కుదుటపడతారు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం అనుకూలించదు. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. మనోధైర్యంతో మెలగండి. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. దైవకార్యాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు వేగవంతమవుతాయి. పత్రాలు అందుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. సామరస్యంగా మెలగండి. సోమ, మంగళవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు శుభవార్తా శ్రవణం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యవసాయ రంగాల వారికి నిరాశాజనకం. ప్రయాణం వాయిదా వేసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
ఆర్థికస్థితి సామాన్యం. ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. బంధుమిత్రుల వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సామరస్యంగా మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు క్రమంగా చక్కబడతాయి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. బుధవారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ఉపాధ్యాయులకు పురస్కారయోగం. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. నూతన పెట్టుబడులకు తరుణం కాదు. సరుకు నిల్వలో జాగ్రత్త.. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
అనుకూలతలు అంతంత మాత్రమే. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఎదుటివారి ఆంతర్యం గ్రహించి మెలగండి. సన్నిహితులతో కలయికతో కుదుటపడతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆది, గురువారాల్లో ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. మీ ఇష్టాయిష్టాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. ఆరోగ్యం సంతృప్తికరం. సాంకేతిక వైద్య రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. సన్మాన, సామాజిక సభల్లో పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
గ్రహసంచారం అనుకూలంగా ఉంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. స్నేహ సంబంధాలు బలపడతాయి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఆదాయం బాగుంటుంది. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు ధనసహాయం అర్ధిస్తారు. కొంతమొత్తం సాయం అందించండి. మీ శ్రీమతి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. పదవుల నుంచి తప్పుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు అదనపు బాధ్యతలు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. 
 
కుంభం : ధనిష్ఠ 3, 4 పాదములు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదములు 
ఈ వారం ప్రతికూలతలు అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. ఆలోచనేలు పలు విధాలుగా ఉంటాయి. పనుల్లో శ్రమ, చికాకులు అధికం. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. మీ శ్రీమతి ధోరణిలో మార్పు వస్తుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఆధ్మాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
మీ కృషి ఫలిస్తుంది. అవకాశాలు కలిసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయాలు బలపడతాయి. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. శుక్ర, శనివారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. సంతానం ఉన్నత విద్యలపై దృష్టి పెడతారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సోదరుల మధ్య ఆస్తి వ్యవహారాల ప్రస్తావన వస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఉపాధ్యాయులకు పదవీయోగం. రిటైర్డు ఉద్యోగస్తులకు వీడ్కోలు పలుకుతారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసిరావు. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.