గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 జులై 2023 (14:29 IST)

రైతుగా మారిన రాహుల్ గాంధీ.. ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్ని.. నాటు నాటారు

Tractor
Tractor
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ నాటు నాటారు. రైతుగా మారారు. వ్యవసాయ కూలీలతో కలిసి నాటు వేస్తూ పనులు వేశారు. ట్రాక్టర్ ఎక్కి దుక్కి దున్నారు. సోనిపట్‌లోని బరోడా నియోజకవర్గంలోని పలు గ్రామాల పొలాల్లో ఈ పనులు చేశారు. 
 
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సిమ్లా పర్యటనకు బయలుదేరారు. దారిలో సోనిపట్ వద్ద కూడా ఆగి పొలాల్లో పని చేస్తున్న రైతుల మధ్యకి చేరుకున్నారు. వాస్తవానికి  రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రతో ఇమేజ్ పెరిగింది. 
 
మరోవైపు, పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీ పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. రెండేళ్ల శిక్షను సమర్థించింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ సిమ్లా పర్యటన జరుగుతోంది.