గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 ఆగస్టు 2023 (13:30 IST)

బియ్యం ధరలపై కేంద్రం నిఘా.. బాస్మతి బియ్యం ఎగుమతులపై..?

rice
బియ్యం ధరలపై కేంద్రం నిఘా పెట్టింది. ధరల నియంత్రణపై ప్రత్యేక చర్యలకు పూనుకొంది. అన్నిరకాల బాస్మతి బియ్యం ఎగుమతులపై కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. పెరుగుతున్న ఈ నిషేధాజ్ఞ‌లు ఆగస్టు 27 నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు నోటిఫికేషన్‌లో కేంద్రం వెల్లడించింది. 
 
టన్నుకు 1200 డాలర్లు (సుమారు రూ.99,058) కంటే తక్కువ ధర గల బాస్మతి బియ్యం ఎగుమతిపై నిషేధం అమలు అవుతుందని కేంద్రం తెలిపింది. అయితే ఈ నిషేధం తాత్కాలికమేనని కూడా కేంద్రం వెల్లడించింది. కాగా, ఉప్పుడు బియ్యం ఎగుమతిపై 20 శాతం సుంకం విధిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది కేంద్రం. ఈ నిషేధం అమలు అక్టోబర్ 16 వరకు అమల్లో ఉండనుందని పేర్కొంది.