బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 30 సెప్టెంబరు 2023 (22:49 IST)

అక్టోబర్ 8 నుండి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023

Amazon
భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పండుగ ఈవెంట్ - ‘అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ (GIF) - ప్రైమ్ మెంబర్ల కోసం 24 గంటల ముందస్తు యాక్సెస్‌తో అక్టోబర్ 8, 2023 నుండి ప్రారంభం కానుంది. వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చిన విస్తృత శ్రేణి ఉత్పత్తుల ఎంపిక మీద, గొప్ప విలువ మరియు వేగవంతమైన, విశ్వసనీయమైన డెలివరీ సౌలభ్యంతో ఇదివరకు ఎన్నడూ చూడని డీల్స్‌ని వినియోగదారులు ఆస్వాదించవచ్చు. కిక్ స్టార్టర్ డీల్స్ ద్వారా, అక్టోబరు 6 వరకు 25,000 కంటే ఎక్కువ ఉత్పత్తుల కోసం ముందస్తు యాక్సెస్‌ని కూడా వినియోగదారులు అందుకుంటారు. వాటికోసం ఇక్కడ చూడండి.
 
ఈ తేదీ ప్రకటన గురించి అమెజాన్ ఇండియా కన్స్యూమర్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ మేనేజర్ మనీష్ తివారీ మాట్లాడుతూ, "భారతదేశం వ్యాప్తంగా ఉన్న మా వినియోగదారుల కోసం 'సంతోషాల బాక్సులు' తీసుకురావడానికి మరియు వారికి విస్తృత ఎంపికలు, సాటిలేని విలువ మరియు సౌకర్యం అందించడానికి మేము సిద్ధమయ్యాము. చెల్లింపు ఎంపికల శ్రేణితో పాటు మరియు వారికి నచ్చిన భాషలో ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా వారు షాపింగ్ చేయవచ్చు. ప్రముఖ బ్రాండ్లు అందించే వేలాది కొత్త ప్రారంభాలతో పాటు భారతదేశ వ్యాప్తంగా లక్షల మంది అమ్మకందారుల కోసం వినియోగదారులు యాక్సెస్‌ పొందవచ్చు. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ 2023ని భారతదేశంలోని మిలియన్ల మంది వినియోగదారులకు అతిపెద్ద ఆనందంగా మార్చడం కోసం మా డెలివరీ అసోసియేట్‌లతో పాటు మా బృందాలన్నీ ఉత్సాహంగా ఉన్నాయి. అమెజాన్ లైవ్ నుండి కొత్త ఉత్పత్తి ప్రారంభాలు మరియు ఉత్తేజకరమైన డీల్స్ మరియు ఆఫర్ల వరకు, ఈ సంవత్సరం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌ అనేది మా వినియోగదారులు మరియు విక్రేతలకు అత్యుత్తమంగా ఉంటుందని మేము వాగ్దానం చేస్తున్నాము” అన్నారు.
 
అమెజాన్ ఇండియా ద్వారా నియమించబడిన నీల్సన్ మీడియా నిర్వహించిన ఒక స్వతంత్ర అధ్యయనం** ప్రకారం, భారతదేశం వ్యాప్తంగా ఉన్న వినియోగదారులు ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయడానికి గతంలో కంటే ఉత్సాహంగా, మరియు గతంలో ఎప్పుడూ లేనంత ఆసక్తితో ఉన్నారు. 81% మంది ఈ విషయంలో బలమైన సెంటిమెంట్ మరియు ఉద్దేశ్యం వ్యక్తం చేశారు; 78% మంది ఆన్‌లైన్ షాపింగ్‌ను విశ్వసించారు మరియు గత ఏడాదితో పోలిస్తే, ఈ పండుగ సీజన్‌లో ఆన్‌లైన్ కొనుగోళ్ల మీద వ్యయం పెంచాలని 2 మందిలో ఒకరు భావిస్తున్నారు. ఈ క్రమంలో, విస్తృతమైన ఎంపికలు, పోటీ ధరలతో పాటు ఆన్‌లైన్ షాపింగ్ అనుభవానికి కీలకమైన సాటిలేని విలువ, సులభమైన సౌలభ్యం మరియు ఎక్స్ఛేంజ్ సౌకర్యం కోసం వినియోగదారులు నిరీక్షిస్తున్నారు. దాదాపు సగం మంది వినియోగదారులు వారి పండుగ షాపింగ్ కోసం Amazonని అత్యంత విశ్వసనీయమైన మరియు తాము గొప్పగా ఇష్టపడే ఆన్‌లైన్ బ్రాండ్‌గా పేర్కొనడంతో పాటు 68% మంది వినియోగదారుల దృష్టిలో వారు ఎంచుకునే మరియు వారికి అనుకూలమైన ఆన్‌లైన్ షాపింగ్ గమ్యస్థానంగా Amazon ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది; Amazonలో విస్తృతమైన ఉత్పత్తుల ఎంపిక మరియు బ్రాండ్లు ఉన్నట్లు 75% వినియోగదారులు పేర్కొన్నారు.
 
Amazonలో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఏ స్థాయిలో అద్భుతంగా ఉంటుందో తెలియజెప్పే కొన్ని విశేషాలు ఇక్కడ చూడండి:
తాజా స్మార్ట్‌ఫోన్లు INR 5,699 నుండి ప్రారంభం కానుండగా, 5G మొబైల్‌లు NR 8,999 నుండి ప్రారంభం కానున్నాయి
ఎలక్ట్రానిక్స్ మరియు యాక్ససరీలు INR 99 నుండి ప్రారంభం కానున్నాయి
అప్లికేషన్ల మీద 65% వరకు తగ్గింపు లభించనుంది
టీవీల మీద 60% వరకు తగ్గింపు లభించనుంది
గృహ, వంటగది మరియు ఔట్‌డోర్ ఐటమ్‌లు INR 49 నుండి ప్రారంభం కానున్నాయి
రోజువారీ అవసరమయ్యే వస్తువులు 60% వరకు తగ్గింపుతో లభిస్తాయి
అగ్రశ్రేణి ఫ్యాషన్ మరియు బ్యూటీ బ్రాండ్‌ల మీద 50-80% తగ్గింపు లభించనుంది
అగ్రశ్రేణి మొబైల్‌లు, టీవీలు, ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్స్ మీద 18 నెలల వరకు నో కాస్ట్ EMI లభించనుంది
10 లక్షల కంటే ఎక్కువ వస్తువుల మీద కూపన్లతో మరింత సేవ్ చేయండి