బుధవారం, 29 నవంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (18:13 IST)

నిత్యామీనన్ కుమారి శ్రీమతి సిరీస్ ఫ్యామిలీ కలిసి ఎంజాయ్ చేస్తారు : హను రాఘవపూడి

swpna dath, Hanu Raghavapudi, nandini reddy
swpna dath, Hanu Raghavapudi, nandini reddy
నిత్యామీనన్  నటించిన అమెజాన్ ప్రైమ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమాస్ ఈ సిరీస్‌ను నిర్మించింది. ప్రముఖ దర్శకుడు శ్రీనివాస్ అవసరాల ఈ వెబ్ సిరీస్‌కి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, గోమటేష్ ఉపాధ్యాయ దర్శకత్వం వహిస్తున్నారు. కుమారి శ్రీమతి’ సెప్టెంబర్ 28న ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రసారం కానుంది. ఇప్పటికే  విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు కుమారి శ్రీమతి యూనిట్ ప్రెస్ ప్రీమియర్ షో అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో దర్శకులు హను రాఘవపూడి, నందిని రెడ్డి తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
 
దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ.. సిరీస్ ‘కుమారి శ్రీమతి’ అనే టైటిలే ఎక్స్ ట్రార్డినరీ గా వుంది. స్వప్న గారికి ప్రాజెక్ట్ కె, సీతరామం, అన్ని మంచి శకునములే .. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ ఎంత ఇష్టమో.. కుమారి శ్రీమతి వాటికంటే పది శాతం ఎక్కువ ఇష్టం. ఎప్పుడు వచ్చిన ఈ ప్రాజెక్ట్ గురించి చాలా ఉత్సాహంగా మాట్లాడేవారు. అలాగే ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. ఇప్పుడు క్యాలిటీలో అది కనిపిస్తోంది. ఇందులో కనిపించిన పాత్రలన్నీ మన చుట్టూ వున్నవే. ఈ పాత్రలన్నీ చూడటం చాలా అద్భుతంగా అనిపించింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే షో ఈ మధ్య కాలంలో ఇదేనేమో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అందరూ ఎంజాయ్ చేస్తారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్’’ తెలిపారు.
 
నందిని రెడ్డి మాట్లాడుతూ.. స్వప్న గారు ‘కుమారి శ్రీమతి’ ఐడియా చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. తర్వాత శ్రీనివాస్ అవసరాల ఈ కథకి మాటలు స్క్రీన్ ప్లే రాస్తున్నారని తెలిసి పర్ఫెక్ట్ అనిపించింది. నిత్యామీనన్ చేస్తున్నారని తెలిసిన వెంటనే క్యారెక్టర్ కనిపించింది. అప్పుడే ఈ షో భలే వుంటుందని అనిపించింది. ఈ రోజు ఆడిటోరియమ్ అంతా నవ్వులు వర్షం కురిసింది. చాలా ఆహ్లాదంగా వుంది. ఓటీటీలో కలసి కట్టుగా చూడగలిగే షో ఇది. ఈ షో మన ఇంట్లో చేసుకున్న ఒక చక్కటి విందు భోజనంలా వుంటుంది. ఒకొక్క ఎపిసోడ్ లో వారు చేసిన ప్రదర్శన వారి ప్రపంచంలోకి ఆకట్టుకుంటుంది. స్వప్న సినిమా నుంచి ఒక ప్రోడక్ట్ బయటికి వచ్చిందంటే చాలా క్యాలిటీగా వుంటుంది. ఓటీటీ లో ఈ షో పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ’’ అన్నారు.
 
స్వప్న దత్ మాట్లాడుతూ.. మాకు తెలిసింది సినిమా మాధ్యమమే. ఈ మాధ్యమంలో మంచి కథలు చెప్పాలని ప్రయత్నిస్తుంటాం. కథ నచ్చితే అది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకులకు మంచి కథని చూపించాలనేది మా ప్రయత్నం. శ్రీమతి పాత్రని పోషించడం అంత సులువు కాదు. ఆ పాత్రలో చాలా ఎమోషన్స్ వుంటాయి. అలాంటిది నిత్యామీనన్ అద్భుతంగా నటించారు. అలాగే నిరుపమ్ తో పాటు అందరూ చక్కని నటన కనబరిచారు. ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా ఆస్వాదించే సిరీస్ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుంది’’ అన్నారు.