1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 9 సెప్టెంబరు 2023 (18:38 IST)

అమెజాన్ రన్ ఫర్ చేంజ్‌ను జెండా ఊపి ప్రారంభించిన మిలింద్ సోమన్

image
దేశంలో అతిపెద్ద ఆన్‌లైన్ విరాళాల ప్లాట్‌ఫామ్ అయిన గివ్ ఇండియాతో కలిసి అమెజాన్ తమ రన్ ఫర్ చేంజ్‌ను విజయవంతంగా ముగించింది. రన్ ఇండియా రన్ భాగస్వామ్యంతో నిర్వహించబడిన ఈ 5 కి.మీ పరుగును భారతీయ మోడల్ మరియు ఫిట్‌నెస్ ప్రేమికుడు శ్రీ మిలింద్ సోమన్ జెండా ఊపి ప్రారంభించారు. దాదాపు 3000 మందికి పైగా అమెజోనియన్లు మరియు వారి కుటుంబ సభ్యులు విద్య మరియు హరిత గ్రహం కోసం తమ మద్దతును అందించడానికి ఈ రన్‌లో పాల్గొన్నారు.
 
సమాజానికి తిరిగి ఇవ్వడంతో మరియు ఉజ్వల భవిష్యత్తును సృష్టించాలానే తమ మిషన్‌లో భాగంగా, అమెజాన్ యొక్క ‘గ్లోబల్ మంత్ ఆఫ్ వాలంటీరింగ్‌’లో భాగంగా ‘రన్ ఫర్ చేంజ్’ నిర్వహించబడింది. నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నంలో భాగంగా,  ప్రతి 2.5 కి.మీ దూరం కవరేజికి, ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి స్కూల్ కిట్‌ను అమెజాన్ విరాళంగా ఇస్తుంది, అంతేకాకుండా, ఈ  బహుళజాతి సంస్థ ప్రతి 1 కి.మీ కవరేజికి ఒక చెట్టును నాటుతుంది. అదనంగా, రిజిస్ట్రేషన్ రుసుము నుండి వచ్చే తోడ్పాటుకు, మూడు రెట్లు అధికముగా అమెజాన్ జోడించి, దానిని స్వచ్ఛంద సంస్థ గివ్ ఇండియాకు విరాళంగా అందిస్తుంది. 
 
అమెజాన్ యొక్క గ్లోబల్ మంత్ ఆఫ్ వాలంటీరింగ్, 1 సెప్టెంబర్ 2023 నుండి 30 సెప్టెంబర్ 2023 వరకు, వివిధ కారణాలు మరియు లాభాపేక్ష రహిత సంస్థలకు మద్దతునిస్తూ ప్రపంచవ్యాప్తంగా స్వయంసేవక కార్యకలాపాలలో పాల్గొనడానికి అమజానియాన్స్ కోసం ప్రారంభించిన ఒక కార్యక్రమం. ఈ గ్లోబల్ ప్రయత్నం 2022లో మొదటిసారిగా ప్రారంభించబడింది, దాదాపు 50కి పైగా దేశాలలో ఉద్యోగులు దీనిలో పాల్గొంటున్నారు మరియు వారి సమయం మరియు నైపుణ్యాలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు. ఈ కార్యక్రమం,  ఒకే రకమైన స్వయంసేవక కార్యకలాపాలకు మాత్రమే పరిమితం కాదు,  ఉద్యోగులు  తమ ఆసక్తులు మరియు నైపుణ్యాలకు అనుగుణంగా, సామాజిక బాధ్యత మరియు కమ్యూనిటీ ఎంగేజిమెంట్ యొక్క భావాన్ని పెంపొందించే మార్గాల్లో సహకరించమని ప్రోత్సహిస్తుంది.
 
అమెజాన్ ఇన్ ద కమ్యూనిటీ (ఇండియా మరియు APAC) హెడ్- శ్రీమతి అనిత కుమార్ మాట్లాడుతూ, “GMV అనేది మన కమ్యూనిటీలకు మమ్మల్ని మరింత దగ్గర చేసిన కార్యక్రమం. గ్రహం మరియు కమ్యూనిటీలకు తిరిగి ఇవ్వడానికి ఇది ప్రేరణనిచ్చింది, అదే సమయంలో సంస్థ లోపల స్వయంసేవక సంస్కృతిని నిర్మిస్తుంది. ఈ నెలలో, అమెజోనియన్లు తాము మక్కువ చూపే స్వయంసేవక కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రోత్సహించబడతారు, అదే సమయంలో తమ లక్ష్యం సాకారం చేసుకోవటానికి తగిన కార్యాచరణ మార్గాలను సైతం అందుకుంటారు. వాలంటీర్లకు ఏడాది పొడవునా అవకాశాలు కూడా అందించబడతాయి, వీటిలో చాలా వరకు దీర్ఘకాలిక నిబద్ధత అవసరం. అమెజాన్ రన్ ఫర్ చేంజ్ అనేది ఒక సమిష్టి కృషి, మరియు దీనిని ముందు వుండి  మా కోసం నడిపించినందుకు శ్రీ మిలింద్ సోమన్‌కు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము..." అని అన్నారు. 
 
ఈ కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన శ్రీ మిలింద్ సోమన్ మాట్లాడుతూ, “ఈ రోజు ఈ రన్‌ను జెండా ఊపి ప్రారంభించటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. నా మనసుకు నచ్చిన అంశం తో కలిసి స్వచ్ఛందంగా పనిచేయడం నాకు ఎల్లప్పుడూ సంతోషం కలిగిస్తూనే ఉంటుంది. ఒక లక్ష్యం కోసం పరుగులు తీయడానికి వేలాదిగా వచ్చిన నగరవాసులను చూస్తుంటే నా హృదయం ఆనందంతో నిండిపోయింది. కమ్యూనిటీ యొక్క శక్తి నన్ను ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే  ఉంటుంది” అని అన్నారు.