శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (13:16 IST)

అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్.. ఆఫర్ల భలే

Great Indian Festival 2023
Great Indian Festival 2023
అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో కూడా ఇదే విధమైన ప్రత్యేక సేల్ ప్రారంభించబడుతుంది. ఈ సంద‌ర్భంగా అమెజాన్ సైట్‌లో ఎలాంటి ప్ర‌త్యేక ఆఫ‌ర్లు ఇవ్వ‌నున్నాయ‌న్న స‌మాచారం టీజ‌ర్‌గా ప‌బ్లిష్ అయ్యింది. ఇందులో భాగంగా ప్రస్తుత అమెజాన్ స్పెషల్ సేల్ మొబైల్ ఫోన్ మోడల్స్, అలెక్సా, ఫైర్ టీవీలపై 40 శాతం వరకు ఉంది. కిండ్ల్ వంటి పరికరాలపై 55 శాతం వరకు తగ్గింపు వుంటుంది. 
 
ఇది కాకుండా గ్రాండ్ ఓపెనింగ్ డీల్, కిక్ స్టార్టర్ డీల్, బ్లాక్ బస్టర్ డీల్, 8 గంటల డీల్, రూ. 999 తక్కువ ధర డీల్‌లు, నగదు బహుమతులు, కూపన్ తగ్గింపులు, క్యాష్‌బ్యాక్ వివిధ ఆఫర్లు కూడా వున్నాయి. ఇంకా ఎస్.బి.ఐ బ్యాంక్‌తో కలిసి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెలవారీ వాయిదాల ఆఫర్‌ను ఉపయోగించడంపై 10 శాతం తగ్గింపు వుంటుంది.