సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 16 ఆగస్టు 2023 (14:33 IST)

మళ్లీ భారతీయ మార్కెట్‌లోకి హానర్ మొబైల్.. ధర ఎంతంటే...

honor 90
భారతీయ స్మార్ట్ మొబైల్ మార్కెట్‌లోకి మళ్లీ చైనాకు చెందిన హానర్ మొబైల్స్ రానుంది. నోయిడాకు చెందిన భారతీయ కంపెనీ ఒకటి ఈ ఫోన్లను స్వదేశీ మార్కెట‌్‌లోకి విడుదల చేయనుంది. చైనా కంపెనీ హానర్‌తో ఈ కంపెనీ మూడేళ్ళ క్రితం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు ఈ ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. అయితే, ఈ ఫోన్ల విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. అయితే, మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. హానర్ 90 పేరుతో వీటిని విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. 
 
ఇందులోని ఫీచర్లపై కూడా ఈ కథనంలో ప్రస్తావించారు. హానర్ 90తో పాటు 90 ప్రోను చైనాలో ఇప్పటికే విడుదలైంది. అయితే, స్నాప్‌డ్రాగన్ 7 జనరేషన్ 1 చిప్‌సెట్‌తో వస్తున్న ఈ ఫోనును ఏకంగా 16 జీబీ ర్యామ్ కలిగివుంది. 6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్ కర్వ్‌డ్ ఓలెడ్ డిస్‌ప్లే, 12 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 200 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌తో వెనుకవైపు మూడు కెమెరాలు, సెల్ఫీల కోసం 50 మెగాపిక్సల్ కెమరా, 512 జీబీ అంతర్గత మెమరీ, 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫ్ 6, బ్లూటూత్ 5.2, ఆండ్రాయిడ్ 13 ఆధారిత 7.1, యూఎస్బీ సీ టైప్, ఎన్.ఎఫ్.సి, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 66 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లను కలిగివున్నట్టు తెలుస్తుంది. అయితే, ఈ ఫోన్ ధరతో పాటు విడుదల చేసే వివరాలు తెలియాల్సివుంది.