మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జులై 2023 (12:36 IST)

భారత మార్కెట్లోకి Pad X9 పేరుతో కొత్త టాబ్లెట్‌.. ఫీచర్లు, ధర?

Honor Pad X9
Honor Pad X9
భారతదేశంలో Pad X9 పేరుతో కొత్త టాబ్లెట్‌ను విడుదల చేస్తున్నట్లు హానర్ ప్రకటించింది. ఈ మోడల్ కోసం ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ గాడ్జెట్ ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. Honor Pad X9 సొగసైన ప్రొఫైల్‌ను పొందుతోంది. దీని మందం 6.9 మిమీ, బరువు 495 గ్రాములు, ఇది మెటల్ యూనిబాడీ డిజైన్‌ను కలిగి ఉంది. స్క్రీన్ టు బాడీ రేషియో 86 శాతంను కలిగివుంటుంది
 
ఇకపోతే.. ఈ ట్యాబ్‌లో, 11.5 అంగుళాల 2K IPS-LCD స్క్రీన్ అందుబాటులో ఉంది. 120 Hz రిఫ్రెష్ రేట్, 400 nits ప్రకాశంతో వస్తోంది. అలాగే 6 స్పీకర్లు, హై-రెస్ ఆడియో, హానర్స్ లిసన్ ఆడియో అల్గారిథమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది 5MP వెనుక కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
 
మరోవైపు, ఈ Honor Pad X9లో స్నాప్‌డ్రాగన్ 685 ప్రాసెసర్ వస్తోంది. ఇది 4GB RAM, 128GB స్టోరేజ్‌తో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. 3GB వర్చువల్ ర్యామ్ కూడా అందుబాటులో ఉందని సమాచారం. ఇది Android 13 ఆధారంగా Magic UI 7.1 సాఫ్ట్‌వేర్‌ను కలిగి ఉంటుంది. 
 
ఇది 7,250 mAh బ్యాటరీని కలిగి ఉంది. 22.5W ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 13 గంటల వరకు ఉపయోగించవచ్చని కంపెనీ పేర్కొంది.
 
ఈ గాడ్జెట్ ధర రూ. 14,499. హానర్ 90ని భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మోడల్ సెప్టెంబర్ మధ్యలో మార్కెట్లోకి రానుందని సమాచారం.