1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

07-10-2023 శనివారం రాశిఫలాలు - శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం....

Mithunam
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద ఐ|| అష్టమి ఉ.10.04 పునర్వసు రా.2.29 ప.వ.1.37 ల 3.20. ఉ.దు. 5.54 ల 7.28.
శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించిన సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషం :- అందరితో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది. మీ సంతానంతో ఉల్లాసంగాను, ఉత్సాహంగాను గడుపుతారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో, ఇంటర్వ్యూలలో నిరాశ తప్పదు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు. 
 
వృషభం :- బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తల, ఎముకలకి సంబంధించిన చికాకులు తలెత్తినా నెమ్మదిగా సమసిపోగలవు. ఒక దైవ కార్యం ఘనంగా చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. 
 
మిథునం :- సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. వ్యవహార ఒప్పందాల్లో చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. స్త్రీలకు నరాలు, దంతాలు, రుతు సంబంధిత చికాకులు అధికం. బంధు మిత్రులతో కలిసి దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు.
 
సింహం :- ఇతరులపై ఆధారపడక మీ పనులు మీరే చేసుకోవటం క్షేమదాయకం. పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తుతాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంటా బయటా సానుకూల పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది.
 
కన్య :- సహోద్యోగులతో సంబంధాలు బలపడతాయి. వృత్తిపరమైన సంబంధాలు బలపడతాయి. ఆత్మీయుల క్షేమ సమాచారం తెలుసుకుంటారు. సావకాశంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. చిన్న తప్పిదాలే పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అభ్యంతరాలు, ఆక్షేపణలు ఎదుర్కోవలసివస్తుంది.
 
తుల :- ఉద్యోగస్తులకు అతికష్టంమ్మీద సెలవులు మంజూరవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పదవుల స్వీకరణకు అనుకూలం. గత సంఘటనలు, అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. పనులు, కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి.
 
వృశ్చికం :- స్థిరాస్తిక్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. కళలు, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుంటారు. వాస్తు మార్పుల వల్ల వ్యాపారంలో ఆశించిన ఫలితాలుంటాయి.
 
ధనస్సు :- కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు అధికమవుతాయి. మీ శ్రీమతిని సలహా అడగటం శ్రేయస్కరం. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారు అని గమనించండి.
 
మకరం :- మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. ఆర్థికంగా ఎదగాలనే మీ ఆశయం నిదానంగా ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసివస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులే అనుకూలిస్తాయి. మీ జీవితభాగస్వామి విషయంలో దాపరికం మంచిది కాదు.
 
కుంభం :- కొబ్బరి, పండ్లు, పూలవ్యాపారులకు కలిసివస్తుంది. పెద్దల ఆశీస్సులు, ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. సాహస ప్రయత్నాలు విరమించండి. రాజకీయ నాయకులకు పదవీ సమస్యలు అధికమవుతాయి. స్త్రీలకు ఇరుగు పొరుగువారితో అంత సఖ్యత ఉండదు. మీ సంతానం మొండి వైఖరి చికాకులను కలిగిస్తుంది.
 
మీనం :- బంధువులు మీ నుంచి పెద్దమొత్తంలో ధనసహాయం అర్థిస్తారు. కానివేళలో ఇతరుల రాకఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించుటకు అనువైన సమయం. పాత రుణాలు చెల్లించటంతో పాటు తాకట్టు విడిపించుకుంటారు.