గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-10-2023 సోమవారం రాశిఫలాలు - మల్లికార్జునుడిని పూజించిన శుభం...

simha raasi
శ్రీ శోభకృత్ నామ సం|| భాద్రపద బ|| దశమి ప.1.09 ఆశ్రేష పూర్తి సా.వ.6.43 8.29. ప.దు. 12.14 ల 1.02 పు. దు. 2.37 ల 3.25.
 
మల్లికార్జునుడిని పూజించిన శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- శత్రువులు మిత్రులుగా మారతారు. వాహనం ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహారించండి. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం అధిక సమయం వేచి ఉండాల్సివస్తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోను మీదే పైచేయిగా ఉంటుంది. మీ సంతానం మొండి వైఖరి వల్ల అసహనానికి లోనవుతారు.
 
వృషభం :- రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. రచయితలకు, కళ, క్రీడాకారులకు గుర్తింపు లభిస్తుంది. విద్యార్థుల అత్యుత్సాహం అనర్థాలకు దారితీస్తుంది. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ విరమణ చేసిన వారికి సాదర వీడ్కోలు లభిస్తాయి. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కాలం గడుపుతారు. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారులకు పురోభివృద్ధి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రయాణాల్లో వస్తువులపట్ల మెళకువ అవసరం. 
 
కర్కాటకం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని మార్పులు అనుకూలించవు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. వైద్యులకు ఏకాగ్రత అవసరం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేరు. చేపట్టిన స్వయం ఉపాధి పథకాలు సంతృప్తికరంగా సాగటంతో పాటు మీ యత్నం ఇతరులకు మార్గదర్శకమవుతుంది.
 
సింహం :- వ్యాపారాల్లో ఒడిదుడుకులు, స్వల్ప నష్టాలు ఎదుర్కుంటారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాలలో వారికి సామాన్యంగా ఉంటుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధనసహాయం చేసే విషయంలో లౌక్యం అవసరం. తొందరపాటు నిర్ణయాల వల్ల ఒక్కొసారి మాటపడవలసివస్తుంది. కళా సాంస్కృతిక రంగాల వారు లక్ష్య సాధనకు శ్రమించాలి.
 
కన్య :- స్థిర, చరాస్తుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. తమ మాటే నెగ్గాలన్న పంతం ఇరువురికి తగదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
తుల :- మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికం. ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. వ్యాపారాల్లో పోటీ, షాపు పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి. దూర ప్రయాణాలు, తీర్థయాత్రులు ఉల్లాసంగా సాగుతాయి.
 
వృశ్చికం :- గృహంలో స్వల్ప మార్పులు, మరమ్మతులు చేపడతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు మంచి ఫలితాలనిస్తాయి. రుణాలు తీరుస్తారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. దైవ, సేవా కార్యక్రమాలకు దానధర్మాలు చేయటం వల్ల మీ కీర్తి, ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
ధనస్సు : - కీలకమైన వ్యవహరాల్లో మెళకువ వహించండి. స్త్రీలకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. ప్రతి విషయంలోను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. ఆడిటర్లకు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికంగా ఉంటుంది.
 
మకరం :- నిత్యావసర వస్తు వ్యాపారులకు, రేషన్ డీలర్లకు చికాకులు తప్పవు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తాయి. బంధు మిత్రులతో ఏకీభవించలేకపోతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, శ్రమాధిక్యతలను ఎదుర్కొంటారు.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
మీనం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు, రాతపరీక్షలలో మెళకువ అవసరం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రిప్రజెంటేటివ్‌లు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమకు తగిన ఆదాయం లభిస్తుంది. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు.