విశాల్... మకుటం’ చిత్రానికి గ్రాండ్ క్లైమాక్స్ షూట్ పూర్తి
హీరో విశాల్ స్వీయ దర్శకత్వంలో మకుటం చిత్రం రాబోతోంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద ఆర్ బి చౌదరి 99వ చిత్రంగా రానున్న ఈ ప్రాజెక్ట్‌కి రవి అరసు కథను అందించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, గ్లింప్స్ సంచలనంగా మారాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. వరుసగా 17 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసినట్టుగా ప్రకటించారు. ఈ మేరకు చిత్రయూనిట్ నుంచి ఓ ప్రెస్ నోట్‌ని కూడా రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే..
విశాల్ స్వీయ దర్శకత్వంలో రానున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మకుటం సినిమాకు సంబంధించిన గ్రాండ్ క్లైమాక్స్ షూటింగ్ పూర్తయింది. 17 రోజులుగా నిర్విరామంగా షూటింగ్ చేశాం. ఇంటెన్స్‌తో కూడిన ఈ క్లైమాక్స్‌ను ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు చిత్రీకరించాం. ఓ వార్ సీక్వెన్స్‌కు ఎలాగైతే వందల కొద్దీ స్టంట్ ఆర్టిస్టులతో ఈ క్లైమాక్స్‌ను షూట్ చేశాం. దాదాపు 800 వందల మంది టెక్నీషియన్లతో ఈ షూటింగ్‌ను భారీ ఎత్తున కంప్లీట్ చేశాం.
రా ఎమోషన్స్, విజువల్ గ్రాండియర్, బ్రీత్ టేకింగ్ యాక్షన్‌లతో ఈ క్లైమాక్స్‌ను నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అనేలా చిత్రీకరించాం. విశాల్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న ఈ మొదటి సినిమాలో ఆయన పర్ఫామెన్స్ అదిరిపోతుంది. ఇక దిలీప్ సుబ్బరాయన్ వంటి స్టంట్ కొరియోగ్రాఫర్‌తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించాం.
ఈ 17 రోజుల షెడ్యూల్‌లో ప్రతీ ఒక్కరూ ఎంతో అకుంఠిత దీక్ష, అంకిత భావం, సినిమా పట్ల నిబద్దతతో పని చేశారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ మీద విశాల్ దర్శకత్వంలో రానున్న ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ అంశాలతో రానుంది అని అన్నారు.
జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. దురైరాజ్ కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం. నాథన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.
తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు