మంగళవారం, 11 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 11 నవంబరు 2025 (16:04 IST)

Prabhas: ఫౌజీ.. 23 సంవత్సరాల కెరీర్ లో మైలురాయిలా వుంటుంది

23-year career, Rebel Star Prabhas
23-year career, Rebel Star Prabhas
రెబల్ స్టార్ ప్రభాస్ తన సినీ కెరీర్ 23 ఏళ్ళకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫౌజీ సినిమా ఓ మైలురాయిలా వుంటుందని భావిస్తున్నారు.  ఈ సందర్భంగా పలువురు ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. నిశ్శబ్దం, ఆకర్షణ, బలం, శైలితో ప్రభాస్ ప్రేక్షకుల  హృదయాలను గెలుచుకున్నాడు, కొత్త ప్రమాణాలను నెలకొల్పాడు మరియు మెగాస్టార్ గా సింహాసనాన్ని అధిష్టించాడు అని సోషల్ మీడియాలో ప్రశంసలు వినిపిస్తున్నాయి.
 
తాజాగా ప్రభాస్ హీరోగా ఇమాన్వి హీరోయిన్ గా దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నచిత్రమే ఫౌజీ. రీసెంట్ గా వచ్చిన పోస్టర్స్ తో మంచి హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ ని మేకర్స్ ఆల్రెడీ ఆగష్టు కి లాక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక షూటింగ్ కూడా ఆల్రెడీ శరవేగంగా కంప్లీట్ అవుతుండగా ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి తాజా వార్త బయటకు వచ్చింది.
 
దీనితో సినిమా ఆగష్టు నుంచి వాయిదా పడినట్టు తెలుస్తుంది. అయితే మరీ ఎక్కువ కాదు కానీ ఆ ఆగష్టు, సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ మొదటి వారానికి షిఫ్ట్ అయ్యిందట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా బయటకి రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.