శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 9 అక్టోబరు 2021 (13:53 IST)

అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు : ఉండవల్లి షాకింగ్ కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దుస్థితి మరింత అధ్వాన్నంగా తయారైందనదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పైగా, అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇప్పటికే ఆరు లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్నారు. ఇదే పరిస్థితి మున్ముందు కొనసాగితే మరింత గడ్డు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. 
 
శనివారం రాజమండ్రిలో ఉండవల్ల మీడియాతో మాట్లాడుతూ, ,ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తోంది. జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.6 లక్షల కోట్ల అప్పు చేసింది. అమరావతిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఎంతో మంది సలహాదారులు ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. 
 
ఇంత జరుగుతున్నా అసలు ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారు? అని మాజీ ఎంపీ ప్రశ్నించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏపీకి గడ్డు పరిస్థితి తప్పదని ఉండవల్లి హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఆయన అన్నారు.
 
పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ప్రాజెక్ట్‌ పనులు పూర్తికాకపోయినా హడావుడిగా ప్రకటనలు చేస్తున్నారు. పోలవరం పనుల్లో ఎలాంటి మార్పులు రాలేదు. ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారు. పనులు పూర్తి కాకపోయినా మంత్రులు హడావుడి చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని ఉండవల్ల ఆరోపించారు.