శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : శనివారం, 7 మార్చి 2020 (17:21 IST)

మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా?: పవర్ స్టార్ వకీల్ సాబ్ సాంగ్ సునామీ

వకీల్ సాబ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొంటాయి. దానిక తగ్గట్లుగానే పవన్ కళ్యాణ్ చిత్రం వుంటుంది. ఇక అసలు విషయానికి వస్తే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్‌కమింగ్ మూవీ వకీల్ సాబ్ సాంగ్ ప్రోమోను చిత్ర బృందం కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది.
 
గంటల వ్యవధిలోనే అది 2 మిలియన్ వ్యూస్ చేరుకుంది. ఈ ప్రమో సాంగ్‌లో మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా? అంటూ సిద్ శ్రీరామ్ పాడారు. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాశారు.
 
మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయం 10 గంటలకు ఈ పాటను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.