సంబంధిత వార్తలు
- ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్కి పోటీగా పవన్ మూవీ
- పవర్ స్టార్ ''వకీల్ సాబ్'' ఐతే నేను డైరక్టర్ సాబ్.. వర్మ
- ఈ పనిని ఏ పిచ్చివాడైనా చేస్తాడా? 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్‌పై వర్మ కామెంట్స్
- 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్... ఇచ్చట పాత రికార్డులు సవరించబడును...
- 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజ్... స్టిల్ అదిరిపోయింది గురూ...
ట్విట్టర్‌లో 'వకీల్ సాబ్' సునామీ...
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది. అప్పటి నుంచి ఈ ఫస్ట్ లుక్ ట్విట్టర్‌లో సునామీ సృష్టిస్తోంది.
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అంటే రెండేళ్ల విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ ఆశలే ఉన్నాయి. పైగా, ఈ చిత్రానికి ముందు ఆయన నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.
ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 3.5 మిలియన్ల టైటిల్ ట్యాగ్‌లతో 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రికార్డు సృష్టించింది.
దేశంలో ఇప్పటివరకు మరే ఫస్ట్ లుక్ ఈ ఘనత సాధించలేదు. అంతేకాదు, టాలీవుడ్‌లో అత్యధికంగా 25.3 వేల సార్లు రీట్వీట్ చేసిన ఫస్ట్ లుక్ కూడా ఇదే కావడం గమనార్హం.
హిందీలో హిట్టయిన "పింక్" చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీంట్లో పవన్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత కాగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది.
