ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (17:34 IST)

'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రిలీజ్... స్టిల్ అదిరిపోయింది గురూ...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం వకీల్ సాబ్. అమితాబ్ బచ్చన్ నటించిన బాలీవుడ్ చిత్రం 'పింక్'ను తెలుగులోకి రిమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను వకీల్ సాబ్‌గా ఖరారు చేయగా, చిత్రం ఫస్ట్ లుక్‌ను తాజాగా రిలీజ్ చేశారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. 
 
ఈ విషయాన్ని తెలియజేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ చిత్రయూనిట్ ఓ పోస్ట్ చేసింది. లగేజ్ ఆటో ట్రాలీలో ఓ పుస్తకం చదువుతూ ఓ కుర్చీలో కూర్చుని ఉన్న పవన్, తిరగేసిన మరో కుర్చీపై కాళ్లు ఆనించి ఉండటం ఫస్ట్ లుక్‌లో కనబడుతుంది. కాగా, పవన్ కల్యాణ్ నటించిన 26వ చిత్రమిది. ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానులు భారీ అంచనాలతో ఉన్నారు.
 
కాగా, ఈ చిత్రానికి ప్రముఖ దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా, ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన సొంత నిర్మాణ సంస్థ శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూర్చుతుంటే... శృతిహాసన్ లేదా పూజా హెగ్డేల్లో ఒకరిని హీరోయిన్‌గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.