శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 3 మార్చి 2020 (19:07 IST)

పవర్ స్టార్ ''వకీల్ సాబ్'' ఐతే నేను డైరక్టర్ సాబ్.. వర్మ

Vakeel saab
వకీల్‌సాబ్‌గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చేస్తున్నాడు. తాజాగా టైటిల్‌తో పాటు ఫస్టు లుక్‌ను విడుదల చేసింది యూనిట్.వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం ‌అందిస్తున్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ లుక్‌తో పవర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సూపర్ అంటూ కితాబిచ్చేస్తున్నారు. 
 
కానీ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం సెటైరికల్ ట్వీట్ చేశాడు. పవన్ లాగే వర్మ కూడా కుర్చీలో కూర్చొని ఉన్న స్టిల్‌ను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసి పవన్ వకీల్ సాబ్ అయితే తాను డైరెక్టర్ సాబ్.. అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఇంకా తాను కొంతమంది ఇడియట్స్ గురించి ఆలోచించను ఇడియట్ పనులు చేయనని పోస్ట్ చేశారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ .. దిశ అత్యాచార ఘటనపై ‘దిశ’ పేరుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 
 
ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ‘విరూపాక్షి’ అనే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ సినిమా చేస్తున్నాడు. దాంతో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీని అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం సినిమాలతో పవన్ బిజీగా వున్నారు.