బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (11:10 IST)

దీపావళి వేడుకల్లో అపశృతి... 30 మందికి గాయాలు - ఐదుగురి పరిస్థితి విషమం

bomb blast
దీపావళి పండుగ రోజున హైదరాబాద్ నగరంలో విషాద సంఘటనలు సంభవించాయి. పలుప్రాంతాల్లో బాణాసంచా పేలుళ్ళ కారణంగా జరిగిన అగ్నిప్రమాదాల్లో 30మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వుంది. దీంతో అనేక మంది క్షతగాత్రులు ఆస్పత్రులకు క్యూ కట్టారు. సరోజనీదేవి కంటి ఆస్పత్రికి పలువురు క్షతగాత్రులను తరలించారు. 
 
గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో వీరిలో ముగ్గురిని మరో ఆస్పత్రికి తరలించినట్టు వారు వెల్లడించారు. గాయపడినవారిలో చిన్నారులో అధికంగా ఉన్నట్టు తెలిపారు. మరోవైపు, ఉస్మానియా ఆస్పత్రిలో కూడా 20 మంది వరకు గాయపడ్డారు. వాళ్లకి ప్రాథమిక వైద్య పరీక్షలు చేసి ఇంటికి పంపించినట్టు వైద్యులు వెల్లడించారు.