Candidate Name |
ఎ. ఇంద్రకరణ్ రెడ్డి |
State |
Telangana |
Party |
BRS |
Constituency |
Nirmal |
Candidate Current Position |
Telangana state Minister |
అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి... ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హిందూదేవాదాయ శాఖామంత్రిగా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ సమీపంలోని యల్లపల్లి గ్రామంలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన ఈయన.. ఒక వ్యవసాయి. సోషల్ వర్కర్. 2014లో జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి హరిరావుపై 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొంది, 14వ లోక్‌సభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత భారత రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 1980 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగుతున్న ఇంద్రకరణ్ రెడ్డి.. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా కూడా కొనసాగారు.
1991 నుంచి 1996వరకు ఎంపీగాను, 1999 నుంచి 2004 వరకు 11వ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా 2004 నుంచి 2008 వరకు ఉమ్మడి ఏపీ ఎమ్మెల్యేగా, 2008 నుంచి 2009 వరకు 14వ లోక్‌సభ సభ్యుడిగా, 2014 నుంచి 2018 వరకు తొలి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సభ్యుడిగా, 2018 నుంచి రెండోసారి తెలంగాణ శాసనసభ సభ్యుడిగా మంత్రిగా కొనసాగుతున్నారు. 1949 ఫిబ్రవరి 16వ తేదీన జన్మించిన ఈయనకు భార్య విజయలక్ష్మి ఉండగా, హైదరాబాద్, నిర్మల్‌లో నివాస గృహాలు ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణాలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఈయన ఒకరిగా కొనసాగుతున్నారు.